wedding : పెళ్లైన మూడు రోజులకే విడాకులు.. ఫస్ట్ నైట్ రోజే అసలు ట్విస్ట్!

wedding

wedding :   పెళ్లైన మూడు రోజులకే ఓ జంట విడాకులు తీసుకుంది. ఈ ఘటన యూపీలోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. శోభనం రాత్రే తన భర్త వైవాహిక సంబంధాలకు శారీరకంగా అనర్హుడినని ఒప్పుకున్నాడని ఆరోపిస్తూ వధువు బుధవారం పోలీసులను ఆశ్రయించింది. దీంతో వధువు తరఫువారు పెళ్లి ఖర్చులను తిరిగి చెల్లించాలని వరుడు తరుపు వారిని డిమాండ్ చేశారు.

ఇంతకు ఏం జరిగిందంటే.. 25 ఏళ్ల వరుడు సహజన్వా ప్రాంతంలోని సంపన్న రైతు కుటుంబానికి చెందినవాడు. అతను గోరఖ్‌పూర్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (GIDA)లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బేలియాపర్‌లో నివసించే వధువు కుటుంబానికి చెందిన బంధువుల ద్వారా ఈ పెళ్లి ఫిక్స్ అయింది. నవంబర్ 28న పెళ్లి జరగగా, మరుసటి రోజు విడిది జరిగింది. డిసెంబర్ 1న సంప్రదాయ ఆచారం కోసం వధువు తండ్రి అత్తవారింటికి వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది. వెంటనే, వరుడి కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వధువును ఆమె తల్లిదండ్రుల ఇంటికి తిరిగి తీసుకెళ్లారు.

డిసెంబర్ 3న ఒక బంధువుల ఇంట్లో ఇరు కుటుంబాలు కలుసుకున్నాయి. అక్కడ వరుడి ఆరోగ్య పరిస్థితిని దాచిపెట్టారని వధువు తరఫువారు ఆరోపించారు. ఇదే వరుడికి రెండో వివాహమని, రెండు సంవత్సరాల క్రితం ఇదే కారణాల వల్ల అంతకుముందు పెళ్లయిన వధువు కూడా నెల రోజుల్లోనే అతన్ని విడిచి వెళ్లిపోయిందన్నారు.

రెండు కుటుంబాల సమ్మతితో వరుడిని గోరఖ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లి అక్కడ వైద్య పరీక్షల చేయగా.. రిపోర్ట్‌లో అతను తండ్రి కాలేడని తేలింది. పోలీసుల జోక్యంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. వరుడి కుటుంబం వివాహ ఖర్చుల కింద రూ. 7 లక్షలు, అలాగే అన్ని బహుమతులను ఒక నెలలోగా తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. బంధువుల సమక్షంలో ఇరు పక్షాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.