BIG Updates : ఎర్రకోట వద్ద పేలుడు: కీలక అప్ డేట్స్ ఇవే!

delhi blast
  • BIG Updates :  సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో హ్యుందాయ్ ఐ20 కారు పేలి తొమ్మిది మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు.
  • ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం (UAPA), పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
  • జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం ఉన్న పుల్వామా నివాసి డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పేలిపోయిన కారును నడిపినట్లు అనుమానిస్తున్నారు.
  • ఇది ఆత్మాహుతి బాంబు దాడినా లేక పెద్ద ఉగ్రవాద కుట్రలో భాగమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  • 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌కు, ఢిల్లీ పేలుడుకు మధ్య సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది.
  • పేలుడులో అమ్మోనియం నైట్రేట్, ఇంధన చమురు. డిటోనేటర్లను ఉపయోగించినట్లు ప్రాథమిక ఫోరెన్సిక్ విశ్లేషణ సూచిస్తుంది.
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఐబీ చీఫ్, ఎన్‌ఐఏ డీజీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సహా ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం జరుగుతుంది.
  • దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, ఫరీదాబాద్‌లలో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు.
  • ఢిల్లీ విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, సరిహద్దు ఎంట్రీ పాయింట్ల వద్ద ముమ్మర తనిఖీలతో హై అలర్ట్‌లో ఉంది.
  • పేలుడు జరగడానికి మూడు గంటల ముందు పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలోనే కారు నిలిపి ఉంచినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముసుగు ధరించిన నిందితుడు కారు నడుపుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది .
  • నవంబర్‌ 13 వరకు ఎర్రకోట మూసివేత.. ఈ మేరకు పోలీసు శాఖ నిర్ణయం