Donald Trump: గ్యాప్ లేకుండా వాయిస్తున్నాడు..కమలా హారిస్‌కు ట్రంప్ బిగ్ షాక్!

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు బిగ్ షాకిచ్చాడు. ఆమెకు ఉన్న సీక్రెట్ సర్వీస్ రక్షణను రద్దు చేశారు. సాధారణంగా అమెరికా రూల్స్ ప్రకారం మాజీ ఉపాధ్యక్షులకు పదవీకాలం ముగిసిన తర్వాత ఆరు నెలల పాటు సీక్రెట్ సర్వీస్ రక్షణ అనేది ఉంటుంది. అయితే మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హారిస్‌కు అదనంగా మరో సంవత్సరం రక్షణను పొడిగించారు.

తాజాగా ట్రంప్ తన అధ్యక్ష ఆదేశాల ద్వారా ఈ పొడిగింపును రద్దు చేశారు. ఈ నిర్ణయం సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వస్తుందని వైట్ హౌస్ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. కమలా హారిస్ తన పుస్తకం “107 డేస్” ప్రచార పర్యటనకు సిద్ధమవుతున్న సమయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో, భద్రతా నిపుణులలో ఆందోళన వ్యక్తమవుతోంది. కమలా హారిస్ భద్రతకు ఇది ప్రమాదకరమని కొందరు విమర్శకులు పేర్కొన్నారు. అయితే హారిస్ బృందం మాత్రం సీక్రెట్ సర్వీస్ వృత్తి నైపుణ్యానికి కృతజ్ఞతలు తెలిపింది. కమలా హారిస్ నివసించే లాస్ ఏంజిల్స్ నగర మేయర్ కరెన్ బాస్, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆమె భద్రతకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

కాగా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.భారత్ పై దిగుమతులపై 50% సుంకం విధించారు. భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, తద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని ట్రంప్ ఆరోపించడమే దీనికి ప్రధాన కారణం. ఈ చర్యలన్నీ భారతదేశం-అమెరికా సంబంధాలను సంక్లిష్టంగా మార్చాయి.