BIG BREAKING : EVMలపై ఈసీ సంచలన నిర్ణయం

BIG BREAKING : బీహార్ అసెంబ్లీ 2025 ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అన్ని పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. EVMలపై గుర్తుతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంచాలని నిర్ణయించింది. బీహార్ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధనను ఈసీ దీనిని అమలు చేయనుంది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని మరింతగా గుర్తించి ఎన్నుకోవచ్చు.

ఒకే పేరు గల అభ్యర్థులు ఉన్నప్పుడు గతంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యేవారు. ఇప్పుడు ఫోటోలు ఉండటం వల్ల సరైన అభ్యర్థిని సులభంగా గుర్తించవచ్చు. వృద్ధులు, అక్షరాస్యులు కాని ఓటర్లకు ఈ మార్పులు చాలా సహాయపడతాయి. ఫోటోను చూసి తమకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేయగలుగుతారు. ఈ కొత్త నిబంధనలు బిహార్‌తో పాటు, రాబోయే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అమలు చేయబడతాయి. ఈ మార్పులు గత ఆరు నెలల్లో ఎన్నికల కమిషన్ తీసుకున్న 28 సంస్కరణలలో భాగం.