Fake Toothpaste : టూత్‌పేస్ట్, ఈనో కూడా కల్తీనే..తోమితే, తాగితే పోవడమే!

Fake Toothpaste

fake toothpaste : ప్రస్తుత సమాజంలో కల్తీకి ఏదీ కాదు అనర్హం అన్నట్లుగా తయారైంది పరిస్థితి.. చిన్నపిల్లలు తాగే పాల దగ్గరినుంచి మనం రోజు వాడే వస్తువులను కూడా ఈజీగా కల్తీ చేసి మార్కెట్ లో కాసులు దండుకుంటున్నారు కేటుగాళ్లు. తాజాగా దేశరాజధానిలో రోజూ వాడే టూత్‌పేస్ట్‌ ముఖ్యంగా క్లోజప్ బ్రాండ్ టూత్‌పేస్ట్ , ఈనో (Eno) వంటిని కల్తీ చేస్తున్నారు.

దంతాలను శుభ్రం చేయకపోగా

కొన్ని కెమికల్స్ తో వాటిని తయారు చేస్తున్న ఈ ఫ్యాక్టరీలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. జగత్‌పూర్ ప్రాంతంలోని ఒక నివాస గృహంలో రహస్యంగా దీనంతా నిర్వహిస్తున్నారు కేటుగాళ్లు. ఈ ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించిన అధికారులు తయారీకి ఉపయోగించే ముడి సరుకులను భారీ స్థాయిలోనే స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ టూత్‌పేస్ట్ దంతాలను శుభ్రం చేయకపోగా, వాటిని కరిగించేసే (Melts the teeth) ప్రమాదకరమైనదిగా అధికారులు గుర్తించారు.

ఇక అసిడిటీ నుంచి ఉపశమనం కలిగించే ఈనో కడుపు మంటను పెంచే రసాయనాలతో తయారైనట్లుగా గుర్తి్ంచారు. అచ్చుగుద్దినట్లు ఒరిజినల్ బ్రాండ్ ప్యాకేజింగ్‌లతో మేకింగ్ చేస్తూ ఢిల్లీలోని వివిధ మార్కెట్‌లకు సరఫరా చేస్తున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఈ రాకెట్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు, ఈ కల్తీ సరుకులను ఎక్కడెక్కడ సరఫరా చేశారో తెలుసుకునేందుకు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

బ్రాండెడ్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వస్తువులు కొనేటప్పుడు అవి నిజమైన బ్రాండెడా లేకా ఫేకా అని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని అధికారులు చెబుతున్నారు.