JEE Main 2026 Results : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ (JEE Main 2026) సెషన్-1 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేడు విడుదల చేసింది. జనవరి 21 నుండి 28 వరకు జరిగిన బీఈ/బీటెక్ (BE/BTech) పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు.
పరీక్ష రాసిన విద్యార్థులు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్‌టీఏ ఇప్పటికే సబ్జెక్టుల వారీగా (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఫైనల్ ఆన్సర్ కీని కూడా అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 6 వరకు అభ్యర్థుల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే ఈ తుది ఫలితాలను ప్రకటించారు.
కేటగిరీ వారీగా కట్-ఆఫ్

