Bengaluru : బాలీవుడ్ రేంజ్లో ప్రీ వెడ్డింగ్ షూట్ .. అలా ఎలా చంపేశావ్ రా!

Bengaluru

Bengaluru : బెంగళూరులో డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసు సంచలనగా మారిన సంగతి తెలిసిందే. కృతికా రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ లో మరణించారు. ఆమె భర్త మహేంద్ర హత్య చేసిన విషయం ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు మహేంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం..  కృతికా రెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. దీంతో మహేంద్ర రెడ్డి ఆమెను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మరో సమాచారం ప్రకారం.. మహేంద్ర రెడ్డి వేరే చోట ఆసుపత్రి నిర్మించాలని కలలు కన్నాడని.. అయితే అందుకు కృత్తికా రెడ్డి కుటుంబం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డారని చెబుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్

వీటన్నిటి మధ్య కృతికా రెడ్డి, మహేంద్ర రెడ్డిల ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ కర్ణాటకలో జరగలేదు కశ్మీర్లో జరిగింది. పెళ్లి తరువాత హనీమూన్ కోసం జమ్మూ కశ్మీర్ కు వెళ్లిన వీరిద్దరూ అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. దీనిని 2024 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లాగ్స్ అనే యూట్యూబ్ పేజీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.

వీరి వివాహం 2024 మే 26 న అంగరంగ వైభవంగా జరిగింది. కశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో బాలీవుడ్ రేంజ్ లో వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగింది. ఈ జంట ఫోటోషూట్ లో కూడా చాలా క్యూట్ గా కనిపించింది. జమ్మూ కశ్మీర్‌లోని దాల్ సరస్సు, సోన్‌మార్గ్, గుల్మార్గ్, డ్రాంగ్ జలపాతం, శంకరాచార్య ఆలయం, దర్గా హజ్రత్‌బాల్‌లలో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగింది. చూడుచక్కగా కనిపించింది ఈ జంట. అయితే కృతికా రెడ్డిని మహేంద్ర రెడ్డి ఎలా చంపగలిగాడు. అతనికి మనసు ఎలా వచ్చిందని కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ అవుతున్నారు .

Also Read :  Doctor: దొంగనా డాక్టర్.. భార్యను కూల్గా చంపేసి ఆర్నెళ్లకు దొరికాడు!