ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి వెనెజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో ఎంపికయ్యారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజల తరఫున పోరాటం చేసినందుకు ఆమెను ఈ అవార్డ్ కు ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ తెలిపింది. వెనెజులా…..నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య దేశంగా మారేందుకు శాంతియుత పోరాటం చేశారని ప్రశంసించింది.
మరియా ప్రస్తుతం వెనెజులా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2011 నుంచి 2014 వరకు వెనెజులా జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా ఉన్నారు. 2002లో మరియా రాజకీయ అరంగేట్రం చేశారు. 2012లో వెనెజుల అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఆమె ఓటమిపాలయ్యారు. అయితే ఈ పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.
కాగా గత సంవత్సరంలో, మచాడో దాక్కుని జీవించవలసి వచ్చింది. ఆమె ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉన్నప్పటికీ, ఆమె తన దేశంలోనే ఉండిపోయింది. ఈ నిర్ణయం లక్షలాది మందికి స్ఫూర్తిని ఇచ్చింది. గత ఎన్నికల్లో మదురోపై పోటీ చేయడానికి మచాడో సిద్ధమయ్యారు, కానీ ప్రభుత్వం ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.
సంవత్సరంలో ప్రకటించే నోబెల్ బహుమతులలో శాంతి బహుమతిని మాత్రమే నార్వేలోని ఓస్లో (Oslo, Norway) లో ప్రధానం చేస్తారు. గత సంవత్సరం ఈ బహుమతి నిహాన్ హిడాంక్యో (Nihon Hidankyo) కు లభించింది, ఇది జపాన్‌కు చెందిన అణు బాంబు దాడుల నుండి బయటపడిన వారి అట్టడుగు ఉద్యమం (grassroots movement). వీరు దశాబ్దాలుగా అణ్వస్త్రాల వినియోగంపై నిషేధాన్ని కొనసాగించడానికి కృషి చేస్తున్నారు.