Karnataka : పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రొఫెసర్, అందరూ చూస్తుండగానే క్లాస్‌రూమ్‌లో ఒక విద్యార్థినికి ప్రపోజ్ చేయడం పెను దుమారానికి దారితీసింది. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరులో ఉన్న శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి విద్యార్థులు సదరు ప్రొఫెసర్‌పై క్యాంపస్‌లోనే దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కాలేజీ కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర గారికి చెందినది కావడం గమనార్హం.
ఈ వ్యవహారం అంతా క్లాస్‌లోని విద్యార్థులు తమ ఫోన్లలో రికార్డు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అబ్దుల్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లాసులో మాట్లాడుతూ.. ఈ బ్యాచ్ తనపై చూపిస్తున్న ప్రేమని ఆపుకోలేకపోతున్నానని, అందుకే ఈ బ్యాచ్‌లోనే తనకు అత్యంత ఇష్టమైన అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నానని చెప్పాడు. అంతటితో ఆగకుండా “ఐ లవ్ యూ” అని చెప్పి విద్యార్థులందరికీ చాక్లెట్లు పంచుతానని ప్రకటించాడు. దీంతో షాక్‌కు గురైన ఆ విద్యార్థిని వెంటనే ప్రొఫెసర్‌ను నిలదీసింది. వెంటనే ప్రిన్సిపాల్‌తో మాట్లాడాలని డిమాండ్ చేసింది.
A serious incident has been reported from Siddhartha Medical College in T. Beguru village of Nelamangala taluk, where a lecturer allegedly proposed to a female student inside a classroom, leading to a tense situation and subsequent violence on campus.
The accused lecturer has… pic.twitter.com/kdhfs5gWuz
— Hate Detector 🔍 (@HateDetectors) March 26, 2026
అయితే ఆ ప్రొఫెసర్ మాత్రం తనను తాను సమర్థించుకుంటూ.. ఆ అమ్మాయే ముందు తనకు లవ్ ప్రపోజ్ చేసిందని, అందుకు తన దగ్గర సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యంగా ఉందని వాదించాడు. “నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పలేదా?” అని ఆమెను తిరిగి ప్రశ్నించాడు. అందుకు ఆ అమ్మాయి ఆగ్రహంతో తాను ఎప్పుడు చెప్పానో నిరూపించాలని అడగ్గా, రేపు మాట్లాడతాను అని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. విద్యార్థులను చాక్లెట్లు తీసుకోమని చెబుతూ క్లాసు నుంచి బయటకు నడిచాడు.
ఈ విషయం కాలేజీ అంతటా వ్యాపించడంతో విద్యార్థులంతా ఒక్కటయ్యారు. ప్రొఫెసర్‌ను అడ్డగించి గొడవకు దిగారు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని తన చెప్పుతో ప్రొఫెసర్‌ను కొట్టగా, మిగిలిన విద్యార్థులు కూడా ఆయనపై దాడికి దిగారు. క్యాంపస్ అంతా ఆయనను వెంటాడి, కారు దగ్గర కూడా చితకబాదారు. ఈ దాడిలో గాయపడిన అబ్దుల్ అతికష్టం మీద అక్కడి నుండి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై స్పందించిన కాలేజీ యాజమాన్యం ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదై దర్యాప్తు జరుగుతోంది.
