అమ్మ దీనమ్మ బత్తాయో..New Year పార్టీకి పిలిచి ప్రైవేట్ పార్ట్స్ కోసేసింది!

New year

New Year : ముంబైలో దారుణం జరిగింది. న్యూ ఇయర్ పార్టీకి అని పిలిచి ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ పై  దాడికి పాల్పడిందో ప్రియురాలు. ఈ ఘటన.. శాంతాక్రజ్ ఈస్ట్, కాలినా ప్రాంతంలో చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువతి, తన 42 ఏళ్ల ప్రియుడితో గత ఏడేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉంది. అయితే, గత కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని సదరు యువతి అతడిని ఒత్తిడి చేస్తోంది. కానీ ఆ వ్యక్తి మాత్రం ప్రతిసారీ నిరాకరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి గుణపాఠం చెప్పాలని ఆమె పెద్ద స్కెచ్ వేసింది.

గురువారం తెల్లవారుజామున పార్టీ జరుగుతున్న సమయంలో, మళ్ళీ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువతి తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేసింది. దీంతో తీవ్ర రక్తపు మడుగులో ఉన్న బాధితుడు ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకుని తన సోదరుడికి సమాచారం అందించాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం వి.ఎన్. దేశాయ్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై వాకోలా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలిపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ప్రాణాంతక ఆయుధాలతో దాడి చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ప్రస్తుతం నిందితురాలు పరారీలో ఉండటంతో, ఆమెను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.