BIG BREAKING : బీహార్లో మోదీకి బిగ్ షాక్.. భారీగా నామినేషన్లు రిజెక్ట్!

pm modi

BIG BREAKING :  బీహార్ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. NDA అభ్యర్థి సీమా సింగ్‌తో సహా మరో ముగ్గురి నామినేషన్లను ఎన్నికల కమిషన్ రిజెక్ట్ చేసింది. ఈసీ రిజెక్ట్ చేసిన వారిలో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అభ్యర్థి సీమా సింగ్ తో పాటుగా అల్తాఫ్ ఆలం రాజు (స్వతంత్ర – మాజీ జేడీయూ జిల్లా అధ్యక్షుడు), ఆదిత్య కుమార్ (బీఎస్పీ అభ్యర్థి), విశాల్ కుమార్ (స్వతంత్ర అభ్యర్థి) ఉన్నారు.

నామినేషన్ పత్రాలలో సాంకేతిక లోపాలు కారణంంగా రిటర్నింగ్ అధికారి వారి నామినేషన్లను రద్దు చేశారు. భోజ్‌పురి సినీ నటిగా బాగా ఫేమస్ అయిన సీమా సింగ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెను మర్హౌరా నుంచి బలమైన అభ్యర్థిగా లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) బరిలోకి దింపింది. ఆమె నామినేషన్ తిరస్కరణ NDA కూటమికి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. లోక్ జనశక్తి పార్టీ NDA కూటమిలో భాగంగా ఉంది. ఆ పార్టీకి 29 సీట్లు కేటాయించారు.

దీంతో ఈ స్థానంలో ప్రధాన పోటీ RJD అభ్యర్థి జితేంద్ర రాయ్, జన సురాజ్ అభ్యర్థి అభయ్ సింగ్ మధ్య మాత్రమే ఉండనుంది. జితేంద్ర రాయ్, ప్రస్తుత ఎమ్మెల్యే, బీహార్ మాజీ మంత్రి కావడంతో ఆయన దాదాపుగా గెలవడం ఖాయం అన్న చర్చ నడుస్తోంది. మర్హౌరా అసెంబ్లీ నియోజకవర్గానికి బీహార్ ఎన్నికల తొలి దశలోనే పోలింగ్ జరగనుంది.

సీమా సింగ్ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, మహారాష్ట్రలో ఆమె 9వ తరగతి వరకు చదువుకున్నారు. ప్రస్తుతం మర్హౌరా ప్రజలకు సేవ చేయాలని ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.  ఇక జేడీయూ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్తాఫ్ ఆలం రాజు నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది.