New Car Prices : కొత్త GST దెబ్బకు తగ్గిన కార్ల ధరలు…మొత్తం లిస్ట్ ఇదే!

New Car Prices : కేంద్రంలోని మోదీ సర్కార్ ఇటీవల GST పన్ను రేట్లలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. దీని వల్ల చాలా కార్ల ధరలు భారీ మొత్తంలో తగ్గాయి. తగ్గిన ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తాయి. బతుకమ్మ, దసరా పండుగ సీజన్‌కు ముందు ఈ తగ్గింపులు కస్టమర్లకు మంచి అవకాశమేనని చెప్పాలి. ఏ కంపెనీ కార్లు ఎంతెంత తగ్గాయో ఒకసారి చూద్దాం.

టాటా మోటార్స్

టాటా మోటార్స్ తన కార్ల ధరలపై రూ. 65,000 నుండి రూ. 1.55 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది.

నెక్సాన్: గరిష్టంగా రూ. 1.55 లక్షలు

సఫారి: గరిష్టంగా రూ. 1.45 లక్షలు

హారియర్: గరిష్టంగా రూ. 1.40 లక్షలు

ఆల్ట్రోజ్: గరిష్టంగా రూ. 1.10 లక్షలు

పంచ్: గరిష్టంగా రూ. 85,000

టియాగో: గరిష్టంగా రూ. 75,000

టిగోర్: గరిష్టంగా రూ. 80,000

కర్వ్: గరిష్టంగా రూ. 65,000

మారుతి సుజుకి

మారుతి సుజుకి కూడా తన పాపులర్ మోడళ్లపై భారీ తగ్గింపులు ప్రకటించింది.

ఆల్టో కే10: రూ. 40,000 నుండి రూ. 50,000 వరకు

స్విఫ్ట్: గరిష్టంగా రూ. 1.06 లక్షలు

వ్యాగన్ ఆర్: గరిష్టంగా రూ. 67,000

బ్రెజా: గరిష్టంగా రూ. 78,000

బలెనో: గరిష్టంగా రూ. 60,000

హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా తన కార్లపై రూ. 2.40 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది.

టక్సన్: అత్యధికంగా రూ. 2.40 లక్షలు

వెన్యూ: గరిష్టంగా రూ. 1.23 లక్షలు

వెన్యూ ఎన్-లైన్: గరిష్టంగా రూ. 1.19 లక్షలు

ఐ20: గరిష్టంగా రూ. 98,053

ఐ20 ఎన్-లైన్: గరిష్టంగా రూ. 1.08 లక్షలు

ఎక్స్‌టర్: గరిష్టంగా రూ. 89,209

ఆరా: గరిష్టంగా రూ. 78,465

అల్కాజర్: గరిష్టంగా రూ. 75,376

క్రెటా: గరిష్టంగా రూ. 72,145

వెర్నా: గరిష్టంగా రూ. 60,640

మహీంద్రా

మహీంద్రా తన ఎస్‌యూవీల ధరలను రూ. 1.01 లక్షల నుండి రూ. 1.56 లక్షల వరకు తగ్గించింది.

ఎక్స్‍యూవీ 3ఎక్స్ఓ (పెట్రోల్): రూ. 1.40 లక్షలు

ఎక్స్‍యూవీ 3ఎక్స్ఓ (డీజిల్): రూ. 1.56 లక్షలు

థార్: గరిష్టంగా రూ. 1.35 లక్షలు

బొలెరో/బొలెరో నియో: గరిష్టంగా రూ. 1.27 లక్షలు

స్కార్పియో-ఎన్: గరిష్టంగా రూ. 1.45 లక్షలు

ఎక్స్‍యూవీ700: గరిష్టంగా రూ. 1.43 లక్షలు

ఇతర బ్రాండ్స్

టయోటా: ఫార్చ్యూనర్, లెజెండర్ వంటి మోడళ్లపై రూ. 3.49 లక్షల వరకు తగ్గింపు.

బిఎమ్‌డబ్ల్యూ: లగ్జరీ కార్లపై గరిష్టంగా రూ. 8.9 లక్షల వరకు తగ్గింపు.

మెర్సిడెస్-బెంజ్: ఎస్-క్లాస్, జీఎల్‌ఎస్ వంటి మోడళ్లపై రూ. 11 లక్షల వరకు తగ్గింపు.

స్కోడా: కుషాక్, స్లావియా వంటి కార్లపై రూ. 63,000 నుండి రూ. 3.3 లక్షల వరకు తగ్గింపు.

అయితే ఈ ధరలు సుమారుగా మాత్రమే. ప్రతి కారు మోడల్, వేరియంట్‌ను బట్టి ధరలలో మార్పు ఉంటుంది. కచ్చితమైన వివరాల కోసం అయితే మీరు కారు షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.