Nirmala Sitharaman : కాంజీవరం చీరలో నిర్మలమ్మ .. మోదీ మాములు స్కెచ్ కాదయ్యా!

Nirmala Sitharaman

Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె( Nirmala Sitharaman) వరుసగా తొమ్మిదో బడ్జెట్.

బడ్జెట్ రోజున ఆమె ధరించే చీరలకు ఒక స్టైల్ ఉంటుంది. ఆమె గత కొన్ని బడ్జెట్లను గమనిస్తే ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్ర చేనేత కళకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోతారు. గత ఏడాది బీహార్ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన మధుబని పెయింటింగ్‌తో కూడిన చీర ధరించిన ఆమె, అంతకుముందు ఏపీ ఎన్నికల వేళ మంగళగిరి చేనేత చీరతో కనిపించారు. ఇప్పుడు ఆమె ధరించిన చీర ఎంటో తెలుసుకునే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

బడ్జెట్ ప్రసంగానికి ముందు కర్తవ్య భవన్‌కు వచ్చినప్పుడు ఈ సారి ఆమె డీప్ మెరూన్ కాంజీవరం చీరలో(Kanjeevaram saree) కనిపించారు. మెరూన్ బాడీపై గోల్డెన్ చెక్స్ ఉన్న ఆ చీర అంచులో కాఫీ బ్రౌన్ బోర్డర్, చేనేత పనితనం ఉట్టిపడుతోంది.తమిళ సంస్కృతికి బీజేపీ ఇచ్చే ప్రాధాన్యతను నిశ్శబ్దంగా చాటిచెప్పారు.

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, తన సొంత రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడం ద్వారా తమిళ ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2005లోనే జీఐ (GI) ట్యాగ్ పొందిన ఈ కంచి పట్టు చీరలు తమిళనాడు గర్వకారణం.

కేవలం చీరతోనే కాదు, తన పనితీరుతోనూ నిర్మలమ్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. మొరార్జీ దేశాయ్ తర్వాత అత్యధిక బడ్జెట్‌లు (9 సార్లు) ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె రికార్డు కెక్కారు. ఒకవైపు అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నా, ఎకనామిక్ సర్వే అంచనా వేసిన 6.8 – 7.2 శాతం వృద్ధి రేటును సాధించే దిశగా ఆమె బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.