భారత్ తో మళ్లీ యుద్ధం జరిగితే తమకే అనుకూల ఫలితాలు వస్తాయని..పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రగల్బాలు పలికారు. భారత్ తో యుద్ధం అవకాశాలను కొట్టిపారేయలేమన్న ఆయన…ఒకవేళ యుద్ధం జరిగితే గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామంటూ బీరాలు పలికారు.
ఆపరేషన్ సిందూర్ తో చావు దెబ్బ తిన్న పాకిస్థాన్ ..ఇటీవలే తన మాటలతో భారత్ ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తోంది. అటు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ కు ఇటీవల భారత్ ఆర్మీ చీఫ్ సైతం గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు.
ఆపరేషన్ సిందూర్ 1.0లో మాదిరిగా ఈసారి సహనాన్ని ప్రదర్శించబోమని…పాక్ ప్రపంచ పటంలో ఉండాలనుకుంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఖవాజా ఈ విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.