BIG BREAKING : దేశంపై ఉగ్రకుట్ర.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

Arrest: గత కొన్ని నెలలుగా పంజాబ్‌లో పోలీసులు ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి విస్తృతమైన ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయత్నాలలో భాగంగా నిషేధిత సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) కు చెందిన పలువురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు ఈ పరిణామం చోటుచేసుకుంది. నిందితులు ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్లను ఉపయోగించి దాడులు చేయాలని కుట్ర పన్నుతున్నారని పోలీసు డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ తెలిపారు.

నిందితులను తర్న్ తరన్‌లోని భుల్లార్ గ్రామ నివాసి హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ ప్రీత్, అమృత్‌సర్‌లోని రాంపురా గ్రామానికి చెందిన గుల్షన్ సింగ్ అలియాస్ నందుగా గుర్తించారు. వారి వద్ద నుంచి రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక 9ఎంఎం పిస్టల్‌తో పాటు ఐదు లైవ్ కార్ట్రిడ్జ్‌, ఒక 86P హ్యాండ్-గ్రెనేడ్, ఒక .30 బోర్ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులు యుకె, అమెరికా, యూరప్‌లలో ఉన్న విదేశీయుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డిజిపి యాదవ్ తెలిపారు.

నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారని, మరింత విచారణ జరిపితేమరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని కౌశంబిలో ఒక BKI ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ఇతను మహా కుంభమేళాలో ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.