Rama Nishad : జాక్ పాట్ అంటే ఇది.. ఫస్ట్ టైమ్ కే మంత్రి పదవి!..నితీష్ దండ వేయడంతో వైరల్!

rama nishad

Rama Nishad : బీహార్ లో ఎన్డీయే సర్కార్‌ మరోసారి కొలువుదీరింది. గురువారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి నితీష్ కుమార్ రికార్డు సృష్టించారు. గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ఖాన్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. నితీష్ తో పాటు బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా కూడా బీహార్ డిప్యూటీ సిఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా 26 మంది ప్రమాణం చేశారు.కేబినేట్ లోకి ముగ్గురు మహిళా మంత్రులను తీసుకున్నారు. వారిలో లేషి సింగ్, రమా నిషాద్, శ్రేయాషి సింగ్ ఉన్నారు.

రమా నిషాద్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే ముజఫర్‌పూర్‌ ఎన్నికల ర్యాలీలో భాగంగా ఔరాయ్ అసెంబ్లీ స్థానం బీజేపీ తరుపున పోటీ చేసిన ఈమె మెడలో సీఎం నితీశ్ కుమార్ పూలమాల వేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ సీఎం ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అప్పుడు ఓ ట్వీ్ట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆమె బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యథిక ఓట్ల మెజార్టీతో (57 వేల ఓట్ల భారీ తేడాతో )గెలిచి రికార్డు సృష్టించడమే కాకుండా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి ఛాన్స్ కొట్టేశారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే ను రాయ్‌ కాదని

వాస్తవానికి ఔరాయ్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ తన సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్‌సురత్ రాయ్‌ ను  కాదని రమా నిషాద్ కు టికెట్ కేటాయించింది. ఈమె ఎవరో కాదు.. మాజీ ఎంపీ అజయ్ నిషాద్ భార్య. . గత 2020 ఎన్నికల్లో గ్రాండ్ అలయన్స్ అభ్యర్థిపై 48,000 ఓట్ల తేడాతో విజయం సాధించాని రాయ్ ను బీజేపీ పక్కన పెట్టి మరి ఈమెకు టికెట్ కేటాయించింది. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ నిరాకరించబడడంతో గత ఏడాది బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన అజయ్ నిషాద్ … ఓటమి తరువాత తిరిగి బీజేపీలో చేరి తన భార్యకు టికెట్ ఇప్పించుకున్నారు.

ఇక రమా నిషాద్ మామ అయిన కెప్టెన్ జై నారాయణ్ ప్రసాద్ నిషాద్.. బీహార్ రాజకీయాల్లో రాణించారు. ఆయన నాలుగుసార్లు పార్లమెంటుకు ఎన్నికై కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మరణానంతరం, అజయ్ నిషాద్ రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ టికెట్‌పై రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. కాగా ఎమ్మెల్యే అయ్యే ముందు రమా నిషాద్ హాజీపూర్ మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా ఉన్నారు.