Biryani: 35 ఏళ్ల ఓ రెస్టారెంట్ ఓనర్ ను ఒక కస్టమర్ కాల్చి చంపేశాడు. ఈ ఘటన రాంచీలో జరిగింది. ఇంతకు ఏం జరిగిందంటే.. బాధితుడైన 47 ఏళ్ల విజయ్ కుమార్ నాగ్ (47) కాంకే-పిథోరియా రోడ్డులోచెఫ్ చౌపట్టి అనే ఓ రెస్టారెంట్ ను నడుపుతున్నాడు. అయితే శనివారం రాత్రి అక్కడిని అభిషేక్ సింగ్ అనే ఒక కస్టమర్ రెస్టారెంట్ వచ్చి వెజ్ బిర్యానీ పార్సెల్ కావాలని తీసుకువెళ్లాడు. అయితే ఇంటికి వెళ్లి చూసేసరికి అందులో నాన్-వెజ్ బిర్యానీ ముక్కలు ఉన్నట్లుగా గుర్తించాడు.
దీంతో కోపంతో అభిషేక్ సింగ్ మరికొంతమందిని వెంటవేసుకుని ఆ రెస్టారెంట్‌కు వచ్చాడు. అక్కడ భోజనం చేస్తున్న యజమాని విజయ్ నాగ్‌ను ఇలా ఎందుకు చేశావ్ అని ప్రశ్నించాడు. మాటమాట పెరిగి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. అయితే గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో నిందితుడు అభిషేక్ సింగ్ తన వద్ద ఉన్న తుపాకీ తీసి విజయ్ నాగ్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో విజయ్ నాగ్ స్పాట్ లోనే చనిపోయాడు.
అనంతరం నిందితులు వెంటనే సంఘటన స్థలం నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. హత్య కేసులో ప్రధాన నిందితుడితో సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులకు ముందు పోలీసులు, నిందితుల మధ్య కాల్పుల మార్పిడి జరిగింది. అభిషేక్ సింగ్ పోలీసులకు భయపడి రాంచీ నుంచి తన కుటుంబంతో కలిసి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు కాంకే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీబీపీ క్యాంపు సమీపంలో గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని చుట్టుముట్టగా, అభిషేక్ సింగ్ పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో అభిషేక్ సింగ్ రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన అభిషేక్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. ఈ కేసులో అభిషేక్ సింగ్‌కు తుపాకులను సరఫరా చేసిన హరేంద్ర సింగ్ అనే సస్పెండైన పోలీసును కూడా అధికారులు అరెస్టు చేశారు. హరేంద్ర సింగ్‌కు నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మూడు తుపాకులు, కార్ట్రిడ్జ్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.