SBI Home Loan Interest Rates 2026: అతి తక్కువ వడ్డీకే రూ.40 లక్షల హోమ్ లోన్… SBI బంపరాఫర్!.. మిస్ అవ్వొద్దు!

SBI Home Loan Interest Rates 2026

SBI Home Loan Interest Rates 2026:  సొంతింటి కల నిజం చేసుకుందామనుకునే వారికి ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI Home Loan Interest Rates 2026) అదిరిపోయే వార్త చెప్పింది. గతేడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 1.25 శాతం తగ్గించింది.దీంతో హోమ్ లోన్లతో పాటు అన్ని రకాల రుణాల వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. దీనివల్ల నేరుగా సామాన్యుల EMI భారం తగ్గింది.

ప్రస్తుతం ఎస్‌బీఐ కేవలం 7.25 శాతం ప్రారంభ వడ్డీ రేటుకే హోమ్ లోన్ ఆఫర్ చేస్తోంది. ఒకవేళ మీరు 30 ఏళ్ల కాలపరిమితితో రూ. 40 లక్షల లోన్ తీసుకోవాలనుకుంటే ఆ లెక్కలు ఇలా ఉంటాయి:

  • వడ్డీ రేటు: 7.25%
  • రుణ కాలపరిమితి: 30 ఏళ్లు
  • నెలకు కట్టాల్సిన ఈఎంఐ: సుమారు రూ.27,500.
  • మీ జీతం ఎంత ఉండాలి?

ఎస్‌బీఐ రూల్స్ ప్రకారం రూ. 40 లక్షల హోమ్ లోన్ మంజూరు కావాలంటే మన నెలసరి ఆదాయం కనీసం రూ. 55,000 ఉండాలి. సాధారణంగా బ్యాంకులు మీ జీతంలో సగాన్ని ఈఎంఐగా పరిగణిస్తాయి. అయితే ఈ లోన్ రావాలంటే మీ పేరు మీద ఇతర లోన్లు ఏవీ ఉండకూడదు.

SBI Home Loan

క్రెడిట్ స్కోర్ (Credit Score) చాలా ముఖ్యం:

ఏ బ్యాంక్ నుండి లోన్ పొందాలన్నా మీ క్రెడిట్ స్కోర్ అద్భుతంగా ఉండాలి. ఒకవేళ మీ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు మీ లోన్ దరఖాస్తును రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, మీరు బ్యాంకుతో చర్చించి వడ్డీ రేటులో మరిన్ని రాయితీలు కూడా పొందవచ్చు. లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూసి బెస్ట్ డీల్ ఎంచుకోవడం బెస్ట్.