Union Budget 2026 : మరో రెండు వారాల్లో సెంట్రల్ గవర్నమెంట్ 2026–-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది. దీంతో దేశవ్యాప్తంగా టాక్స్ పేయర్స్ లో ఉత్కంఠ పెరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వరుసగా తొమ్మిదవ సారి బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు.
ఇక్కడ విశేషమేమిటంటే, ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం అయినప్పటికీ, అదే రోజున ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. చరిత్రలో ఇలా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది రెండోసారి మాత్రమే. దీనికి తోడు, బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు (NSE, BSE) కూడా యధావిధిగా పని చేస్తాయని ప్రకటన వెలువడింది. దీంతో మార్కెట్ వర్గాల్లో ఈసారి భారీ ప్రకటనలు ఉండవచ్చని అంచనాలు మొదలయ్యాయి.
లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూసుకుంటే కేంద్రం ఆ బడ్జెట్ లో సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త పన్ను విధానాన్ని (New Tax Regime) తీసుకువచ్చింది. రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎటువంటి పన్ను లేకుండా నిబంధనలు సవరించారు. దీనితో పాటుగా ఉద్యోగులకు ఇచ్చే స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) రూ. 75,000 కూడా కలిపితే, దాదాపు రూ. 12.75 లక్షల వరకు ఆదాయంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మధ్యతరగతి ఉద్యోగస్థులకు ఇది పెద్ద ఊరటగా మారింది.
ఇప్పుడు మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ ను రూ. 75,000 నుండి రూ. లక్షకు పెంచాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ డిమాండ్ ను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటే వార్షిక ఆదాయం రూ. 13 లక్షల వరకు ఉన్న వారికి ఎటువంటి పన్ను ఉండదన్న మాట. సో చూడాలి మరి.. ఏం జరుగుతుందో.
స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంటి ?
మీ వార్షిక ఆదాయం రూ. 10,00,000 అనుకుందాం. ప్రభుత్వం ప్రస్తుతం రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్‌గా ఇస్తోంది. అంటే ఆదాయపు పన్ను శాఖ మీ మొత్తం రూ. 10 లక్షల మీద పన్ను లెక్కించదు. మీ జీతం నుండి ఈ రూ. 75,000 తీసేసి, మిగిలిన రూ. 9,25,000 మీద మాత్రమే పన్ను లెక్కిస్తుంది. ఇది జీతం తీసుకునే ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఇచ్చే ఒక బోనస్ తగ్గింపు.
Also Read :
- PMMY : ఎలాంటి షూరిటీ లేకుండా రూ.20 లక్షల లోన్.. అస్సలు మిస్ అవ్వొద్దు!
- PM Suraksha Bima Yojana : మీ బ్యాంక్ అకౌంట్లో రూ. 20 లేకపోతే.. రూ. 2 లక్షలు లాస్!
- Telangana :పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు ..సర్కార్ ఉత్తర్వులు!
