Kamalakar Bhat : కర్ణాటకలో సంచలనం సృష్టించిన జ్యోతిష్యుడు కమలాకర్ భట్(Kamalakar Bhat ), సుచిత్ర జాతకాలు తవ్వి తీస్తుంటే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. సుచిత్ర మొదట్లో కమలాకర్ భట్ దగ్గర ఒక బ్రోకర్ (ఏజెంట్) గా పనిచేసేదని పోలీసులు గుర్తించారు. జ్యోతిష్యం, వశీకరణ పూజలు కావాల్సిన మహిళలను లేదా సమస్యల్లో ఉన్నవారిని పట్టుకుని గురూజీ దగ్గరికి తీసుకురావడం ఆమె పని. ఆ సమయంలోనే గురూజీతో ఆమెకు దగ్గర సంబంధం ఏర్పడింది.
సుచిత్ర భర్త మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమెకు సోషల్ మీడియా పిచ్చి ఎక్కువగా ఉండేది. నిత్యం Instagram Reels చేస్తూ, గ్లామరస్ ఫోటోలు పెడుతూ ఉండేది. జ్యోతిష్యుడితో అక్రమ సంబంధం మొదలైన తర్వాత ఆమె వేషధారణ, జీవనశైలి పూర్తిగా మారిపోయింది. భర్తను వదిలేసి గురూజీతో కలిసి శివమొగ్గలో విలాసవంతంగా గడుపుతూ, ఖరీదైన బట్టలు, మేకప్‌కు ప్రాధాన్యత ఇచ్చేది.
సుచిత్ర వ్యక్తిత్వంలోని చీకటి కోణం ఆమె పిల్లల విషయంలో బయటపడింది. తను జ్యోతిష్యుడితో కలిసి ఉండటమే కాకుండా, తన ఇద్దరు ఆడపిల్లలను కూడా ఆ వాతావరణంలోనే ఉంచింది. పెద్ద కూతురు తన తండ్రికి పంపిన మెసేజ్‌లో.. అమ్మ, ఆ జ్యోతిష్యుడు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని వాపోయింది. కన్నబిడ్డలను కూడా జ్యోతిష్యుడి ఆగడాలకు బలిచేయడానికి ఆమె వెనుకాడలేదని భర్త ఆరోపిస్తున్నాడు.
మహేష్ మరో షాకింగ్ విషయం
సుచిత్ర భర్త మహేష్ మరో షాకింగ్ విషయం చెప్పాడు. ఆమెకు కేవలం కమలాకర్ భట్‌తోనే కాకుండా, మరికొందరు యువకులతో కూడా సంబంధాలు ఉండేవని, వాటికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అతను ఆరోపిస్తున్నాడు. ఆమె తన అందాన్ని, సోషల్ మీడియాను పెట్టుబడిగా పెట్టుకుని మనుషులను ట్రాప్ చేసేదని స్థానికంగా చర్చ జరుగుతోంది.
