Tamil Nadu : లెస్బియన్ రిలేషన్ కోసం కన్న కొడుకును లేపేసింది!

Tamil Nadu

Tamil Nadu : తమిళనాడులో దారుణం జరిగింది. తమ లెస్బియన్ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఒక తల్లి మరో మహిళతో కలిసి తమ ఐదు నెలల పసికందును అత్యంత క్రూరంగా హత్య చేసింది. ఈ ఘటన ఈ ఘటన కృష్ణగిరి జిల్లా, చిన్నట్టి గ్రామంలో జరిగింది. మహిళ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

tamilnadu

పోలీసుల సమాచారం ప్రకారం, భారతి, సుమిత్ర గత మూడేళ్లుగా లెస్బియన్ రిలేషన్ లో ఉన్నారు. భారతికి బిడ్డ పుట్టిన తర్వాత, సుమిత్రతో ఎక్కువ సమయం గడపడానికి వీలు కాకపోవడం, ఆ సంబంధానికి పసికందు అడ్డుగా ఉన్నాడనే భావన పెరగడం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

అయితే కొడుకు మరణంపై అనుమానం వచ్చిన సురేశ్, తన భార్య భారతి ఫోన్‌ను పరిశీలించారు. అందులో భారతి, ఆమె భాగస్వామి సుమిత్రకు పంపిన ఫోటోలు, వాయిస్ మెసేజ్‌లు దొరికాయి. వాటి ఆధారంగా భార్యే తమ కొడుకును చంపిందనే అనుమానం బలపడింది. పసికందు హత్య చేసినట్లుగా భారతి అంగీకరించిన రికార్డెడ్ ఫోన్ సంభాషణను కూడా సురేశ్ పోలీసులకు అందజేశాడు.

సురేశ్ అందించిన ఆధారాల మేరకు కేలమంగళం పోలీసులు భారతి, సుమిత్ర ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ ఘటనపై మరింత లోతైన విచారణ కొనసాగుతోంది.