Tejashwi Yadav : ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం.. తేజస్వీ యాదవ్ సంచలన ప్రకటన

Tejashwi Yadav : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీల పర్వానికి తెరలేచింది. ఆర్జేడీ నాయకుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ అతిపెద్ద హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే బిహార్ లో ప్రతి కుటుంబం తప్పనిసరిగా ప్రభుత్వం ఉద్యోగం పొందేలా చట్టం తెస్తామని ప్రకటించారు. గత ఎన్నికల్లో కూడా తాను ప్రభుత్వ ఉద్యోగాలపై హామీ ఇచ్చినట్లు తేజస్వీ వివరించారు. కొన్ని రోజులే పదవిలో ఉన్నప్పటికీ..5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. అదే తాను ఐదేళ్లు పదవిలో ఉంటే ఏం జరుగుతుందో ఊహించుకోవాలని పట్నాలో నిర్వహించిన సమావేశంలో ప్రజలకు సూచించారు. ఇండి కూటమి సీఎం అభ్యర్థిగా భావిస్తున్న తేజస్వీ..ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఆర్జేడీ ఇచ్చిన హామీలను కాపీ కొట్టిన నీతీశ్ …ఎన్నికల ముందు అమలు చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు.. 4లక్షలమందికిపైగా భద్రతా బలగాలను మోహరిస్తామని….. ఆ రాష్ట్ర డీజీపీ వినయ్ కుమార్ తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో పోలింగ్ బూత్ ల వద్ద మోహరించే బలగాలను…. తొలిసారిగా హెలికాఫ్టర్ లో కాకుండా రోడ్డు ద్వారానే…. పంపుతామని ఆయన చెప్పారు. నక్సల్స్ కార్యకలాపాల కారణంగా… ఏ పోలింగ్ బూత్ ను ఈసారి మరో చోటుకు మార్చబోమని ఆయన స్పష్టంచేశారు. ఎన్నికల ముందస్తు విధులకు ఇప్పటికే 500 కంపెనీల…. కేంద్ర సాయుధ బలగాలను మోహరించామని… బిహార్ డీజీపీ వివరించారు. రెండు, మూడు రోజుల్లో… మరో 500 కంపెనీల కేంద్ర సాయుధ బాలగాలు రానున్నాయని చెప్పారు. ఒక్కో కంపెనీలో వంద మంది సిబ్బంది ఉంటారని.. ఆయన తెలిపారు.

60 వేల మంది బిహార్ పోలీసులను.. ఎన్నిక విధులకు కేటాయిస్తామని వెల్లడించారు. వారికి అదనంగా 2 వేల మంది రిజర్వు బలగాలు.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తాయన్నారు. 30 వేలమంది బిహార్ స్పెషల్ పోలీసులు, 20వేలమందికిపైగా హోంగార్డులు, 19 వేల మంది కొత్తగా నియమితులైన కానిస్టేబుళ్లకు… ఎన్నికల విధులు కేటాయిస్తామన్నారు. వీరు కాకుండా లక్షన్నరమంది రూరల్ పోలీసులను కూడా మోహరిస్తామన్నారు. ప్రచారంలో పాల్గొనే ప్రముఖులు, అత్యంత ప్రముఖులకు పటిష్ట భద్రత కల్పిస్తామని బిహార్ డీజీపీ చెప్పారు