TVK : విజయ్ మరో MGR అవుతాడా.. చిరంజీవిలా మిగిలిపోతాడా? 

TVK : తమిళనాడులో మధురైలో TVK పార్టీ రాజకీయ సమావేశానికి వచ్చిన జనం … తమిళనాడులో విజయ్ ఒక తిరుగులేని స్టార్ హీరో, స్టార్ హీరో చూడటానికి వచ్చారో లేక నిజంగానే రాజకీయ పార్టీ నీ గెలిపించడం కోసం వచ్చారో ఎవరికి తెలీదు… 2009లో చిరంజీవి పెట్టినా ప్రజారాజ్యం పార్టీ సభలకు కూడా ఈ రేంజ్ లోనే జనం వచ్చారు. జనం చూసి చిరంజీవి డైరెక్ట్ గా సీఎం సీట్ లో కూర్చుంటారు అనుకున్నారు… కట్ చేస్తే 294 అసెంబ్లీ సీట్ల కు కాను కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి.. ఈ విజయ్ టీవీకే పార్టీకి 18 సీట్లు అన్న వస్తాయో లేదో అని డౌట్… పార్టీ పెట్టి విజయ్ కాంత్ అవుతాడో లేక మరో mgr అవుతాడో చూడాలి.

పార్టీ ఓడిపోతే మాత్రం విజయ్ చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇటు సినిమాలు తీయలేడు అటు పార్టీ నీ నడిపించుకోవడానికి ఫండ్స్ ఎలా నో పార్టీ ఆఫీసు రెంట్ & maintenance కార్య కర్తలు ఖర్చు ఇలా చాలా ఉంటాయి పార్టీ అంటే చిన్న విషయం కాదు .. తమిళనాడు రాజకీయలలో తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ పార్టీ పెట్టి ఓడిపోయిన తర్వాత చాలా కష్టాలు పడ్డారు, పార్టీ మనుగడ కోసం సొంత ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది… పార్టీ పెట్టకపోయి ఉంటే ఇప్పటికీ స్టార్ హీరో గా కొనసాగుతూ బతికి ఉండే వారు. పార్టీ పెట్టి నడపాలంటే సామాన్య విషయం కాదు కొంతమంది స్టార్ హీరోలు విలీనం చేశారు ఇంకొంతమంది రద్దు చేశారు.. చూద్దాం ఏం జరుగుతుందో.