US visa freeze : అమెరికా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 జనవరి 21 నుండి దాదాపు 75 దేశాల వారికి ఇమ్మిగ్రెంట్ వీసాలు అంటే అక్కడే శాశ్వతంగా నివసించడానికి ఇచ్చే వీసాలు ఆపేస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఇమ్మిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్ నిలిపివేసిన 75 దేశాల లిస్టులో ఇండియా లేదు.
అంటే గ్రీన్ కార్డ్ లేదా శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే ఇండియన్స్ పై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపదు. అయితే పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటివి ఈ లిస్టులో ఉన్నాయి. అమెరికా ప్రభుత్వ పథకాలపైనే వారు ఎక్కువగా ఆధారపడి జీవించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. టూరిస్ట్ వీసాలు (B1/B2), వర్క్ వీసాలు (H-1B), స్టూడెంట్ వీసాలు (F-1) వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ కేటగిరీలపై ఈ ప్రభావం ఉండదు.
ఇండియాను ఎందుకు మినహాయించారు?
లిస్టులో అనేక దేశాలను చేర్చి ఇండియాను ఎందుకు మినహాయించారనే దానికి అక్కడి అధికారులు కూడా ఎటువంటి వివరణ ఇవ్వలేదు.ఇండియా .. అమెరికా వలస నిబంధనలకు కట్టుబడి ఉండటం, బలమైన ఆర్థిక సంబంధాల పట్ల తక్కువ ఆందోళనలు ఉండటం దీనికి కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, డిఫెన్స్ రంగాలలో భారతీయుల నైపుణ్యం అమెరికాకు ఎంతో అవసరం.
