Mustafa Khadri : కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఓలవ్ జిహాద్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కొప్పల్ తాలూకా కంప్లి గ్రామానికి చెందిన ముస్తఫా ఖాద్రీ ఎక్లాస్‌పూర్ అనే యువకుడు, నర్సింగ్ చదువుతున్న ఒక హిందూ విద్యార్థినిని ప్రేమ పేరుతో వంచించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏప్రిల్ 10వ తేదీన వీరిద్దరూ కొప్పల్ జిల్లా ఆసుపత్రిలో కలిసి కనిపించడంతో, స్థానిక హిందూ యువకులు వారిని నిలదీశారు. ఈ క్రమంలో నిందితుడి వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లను పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
Love jihad alert
Multiple women are trapped by mustafa.
Intimate photos are caught on phone
Location: Koppal, Karnataka pic.twitter.com/BfgmzG5uaA
— Telangana Maata (@TelanganaMaata) April 11, 2026
విశ్వహిందూ పరిషత్ (VHP) జిల్లా అధ్యక్షుడు సంగమేష్ హిరేమఠ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నిందితుడి ఫోన్లలో వివిధ వర్గాలకు చెందిన సుమారు 16 మంది అమ్మాయిలకు సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. ఒక ఫోనులో 3,000 వీడియోలు, 6,000 ఫోటోలు ఉండగా.. మరో ఫోనులో 3,700 వీడియోలు, 4,000 ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని, వారి ప్రైవేట్ దృశ్యాలను చిత్రీకరించి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనతో ఆగ్రహించిన హిందూ కార్యకర్తలు శనివారం నిందితుడిని పట్టుకుని కొప్పల్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో స్టేషన్ వద్ద వందలాది మంది ప్రజలు గుమిగూడటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల విచారణలో నిందితుడు తాను ఆ యువతిని ప్రేమిస్తున్నానని, ఇప్పటికే వివాహం చేసుకున్నానని చెప్పినప్పటికీ.. ఇది వ్యవస్థీకృత ‘లవ్ జిహాద్’ అని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
VHP ప్రతినిధుల బృందం జిల్లా ఎస్పీ రామ్ ఎల్. అరసిద్ధిని కలిసి నిందితుడి మొబైల్ ఫోన్లు, ఇతర ఆధారాలను అందజేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ, నిందితుడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నామని, కేసులోని అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
