TVK Vijay : కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అధికారికంగా దిగింది. చెన్నైలోని నుంగంబాక్కంలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో విజయ్ తన పార్టీ తరపున మొత్తం 234 నియోజకవర్గాల అభ్యర్థులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వేడుకలో అందరినీ ఆకట్టుకున్న విషయం విజయ్ సరళత. దశాబ్దాలుగా తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించారు. ఈ వార్త విన్న రాజేంద్రన్, శబరినాథన్ ఇద్దరూ వేదికపైనే భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే విజయ్, శబరినాథన్‌ను హత్తుకుని ఓదార్చడం అక్కడ ఉన్న వారందరినీ కదిలించింది. “నాతో ఉన్న వారి ఎదుగుదలే నా అసలైన విజయం” అనే బలమైన సందేశాన్ని విజయ్ ఈ విధంగా ఇచ్చారు.
விஜய் அண்ணனிடம் கார் டிரைவர் வேலை செய்யும் ராஜேந்திரன் மகன் சபரிநாதனுக்கு விருகம்பாக்கம் தொகுதியில் போட்டியிட வாய்ப்பலித்த தலைவர் விஜய்🥹
உண்மையான உழைப்புக்கும் , உணமையான அன்புக்கும் எப்போதும் மதிப்பு உள்ளது!#TVK #vijay #jananayagan #whistle #TVKVijay pic.twitter.com/XkVXJtcbwG
— Rolex (@Rolex3839xr) March 29, 2026
రెండు చోట్ల నుంచి విజయ్ పోటీ
మరో కీలక నిర్ణయంగా, విజయ్ ఈ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేయబోతున్నారు. చెన్నైలోని పెరంబూర్, మధ్య తమిళనాడులోని తిరుచ్చి ఈస్ట్ (తిరుచ్చి తూర్పు) నియోజకవర్గాల నుండి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు కీలక ప్రాంతాల నుండి పోటీ చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పట్టు సాధించాలని ఆయన మాస్టర్ ప్లాన్ వేశారు.
అభ్యర్థుల పేర్లను ప్రకటించిన అనంతరం విజయ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పోరాటం కేవలం ఎన్నికల కోసం కాదు.. ఇది ప్రజల కూటమికి, స్టాలిన్ గారి కూటమికి మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు. ఇలా నేరుగా అధికార పక్షం DMK పై ఆయన విమర్శలు గుప్పించారు. తన అభ్యర్థులు కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాదని, వారు ప్రజలను కాపాడే రక్షకులు అని విజయ్ కొనియాడారు. అవినీతి లేని పాలనను అందించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
