Aira Rawat : క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు కేవలం ఆటగాళ్లే కాదు, అప్పుడప్పుడు స్టేడియంలో ఉండే అభిమానులు కూడా రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోతుంటారు. తాజాగా ఇండియా, యూఎస్ఏ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరా కళ్లు ఒక అందమైన యువతి వైపు మళ్లాయి, అంతే.. అప్పటి నుండి సోషల్ మీడియా అంతా ఆమె గురించే చర్చ మొదలైంది. ఆ మిస్టరీ గర్ల్ పేరు ఐరా రావత్(Aira Rawat).

ఐరా రావత్ సోషల్ మీడియా స్టార్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ మ్యాచ్ రోజున ఆమె నీలం రంగు టీ-షర్టు, తెల్లటి షార్ట్ స్కర్ట్ ధరించి స్టేడియంలో సందడి చేస్తూ కనిపించింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నప్పుడు ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. దీంతో గ్రౌండ్‌లో ఆట కంటే, గ్యాలరీలో ఉన్న ఆమె గురించి వెతకడమే ఎక్కువైపోయింది.

ఐరాకు క్రికెట్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లకు ఆమె వీరాభిమాని. విరాట్ కోహ్లీ పైన ఆమెకు ఎంత ప్రేమ ఉందంటే, ఒకానొక సమయంలో ఆమె విరాట్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని కూడా తన మనసులో మాట బయటపెట్టింది. విరాట్, అనుష్క శర్మలకు పెళ్లయినప్పుడు ఐరా వయసు కేవలం 18 ఏళ్లేనట. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ చూస్తే, టీమ్ ఇండియా ఎక్కడ మ్యాచ్ ఆడినా అక్కడ వాలిపోవడం ఆమెకు అలవాటని అర్థమవుతుంది.

ఆమె ఇన్‌స్టాగ్రామ్ బయోలో తనని తాను ఫ్యాషన్ డ్రీమర్ అని పిలుచుకుంటుంది. స్టైలిష్ ఫోటో షూట్స్ చేస్తూ, క్రికెట్ మైదానాల్లో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఆ మ్యాచ్ రాత్రి కూడా నా టీమ్‌కు సపోర్ట్ చేస్తున్నాను.. స్టేడియంలో ఎనర్జీ అదిరిపోయింది అంటూ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మొత్తం మీద ఈ టీ20 వరల్డ్ కప్ పుణ్యమా అని ఇండియాకు మరో నేషనల్ క్రష్ దొరికిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
