Anjana Krishna:మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో ఫోన్‌లో వాగ్వాదం జరిగిన సంఘటనతో వార్తల్లో నిలిచారు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ. వీరిద్దరికి సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోలాపూర్‌లోని మాదా జిల్లా కుర్డు గ్రామంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ఆమె చర్యలు తీసుకుంటున్న సమయంలో ఆమెకు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నుంచి కాల్ వచ్చింది.
ఆమెకు ఫోన్ చేసిన డిప్యూటీ సీఎం వెంటనే అక్కడ చర్యలు నిలిపివేయమని ఆదేశించారు. అయితే అంజనా కృష్ణ అధికారిక నెంబరు నుండి కాల్ చేయమని స్పష్టంగా చెప్పారు. ఫోన్‌లో తాను మాట్లాడుతోంది నిజంగా డిప్యూటీ సీఎంతోనేనా అనే విషయం తెలియాలంటే తన నంబర్‌కు ఒకసారి వీడియో కాల్ చేస్తారా అని ఆమె డిప్యూటీ సీఎంను ప్రశ్నించారు. దీంతో అజిత్ పవార్ ఫైర్ అయ్యారు.
अजित पवारांचा #IPS अधिकाऱ्याला थेट फोन आणि व्हिडिओ कॉलद्वारे "कारवाई थांबवा"चा आदेश. हा सत्तेचा दुरूपयोग आहे.DySP अंजली कृष्णा यांनी कायदा पाळला, पण उपमुख्यमंत्र्यांनी धमकावलं? मुरुमासाठी इतका हस्तक्षेप का? महाराष्ट्रात खरंच काय चाललंय? अशाच कामांसाठी राज्यातील नेत्यांना आपल्या… pic.twitter.com/bP4uoiStqK
— Vijay Kumbhar (@VijayKumbhar62) September 4, 2025
నీకు ఎంత ధైర్యం?. నేను మీపై చర్యలు తీసుకుంటా. నన్నే వీడియో కాల్ చేయమంటారా? నన్ను చూడాలనుకుంటున్నారుగా.. నాకు వీడియో కాల్ చేయండి అంటూ ఊగిపోయారు. వెంటనే ఆమెకు ఆయన వీడియో కాల్ చేసి తక్షణమే చర్యలు ఆపేయాలంటూ ఆదేశించారు. ఇది ఎవరో వీడియో తీయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆమె నిజాయితీ, ధైర్యసాహసాలకు చాలా మంది ప్రశంసలు తెలిపారు. దీంతో అసలు ఎవరీ అంజనా కృష్ణ అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తు్న్నారు.
అంజనా కృష్ణ IPS అధికారిణి. ప్రస్తుతం ఆమె మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా పనిచేస్తున్నారు. కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. ఆమె తండ్రి బిజు ఒక చిన్న బట్టల దుకాణం యజమాని, ఆమె తల్లి కోర్టులో టైపిస్ట్‌గా పనిచేస్తారు. అంజనా కృష్ణపూజప్పురాలోని సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్‌లో పాఠశాల విద్యను, ఆ తర్వాత హెచ్‌హెచ్‌ఎంఎస్‌పీబీ ఎన్ఎస్ఎస్ కాలేజ్ ఫర్ ఉమెన్, నీరమన్‌కార నుండి గణితంలో బి.ఎస్.సి. డిగ్రీని పూర్తి చేశారు.
ఆ తర్వాత సివిల్స్ సాధించాలన్న నిశ్చయంతో యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. 2022-23లో నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 355 సాధించారు. తాజాగా జరిగిన ఈ ఘటనతో ఆమె దేశ వ్యాప్తంగా హైలెట్ అయ్యారు.
