Kanimozhi Santhosh : త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టీవీకే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఆయన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. టీవీకే నుంచి పలువురు మహిళలకు కూడా టికెట్లు దక్కాయి. అందులో ఒక అభ్యర్థి పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె ఎవరో కాదు. కణిమొళి సంతోష్. కోయంబత్తూర్ జిల్లాలోని కవుండంపాళయం శాసనసభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.
https://twitter.com/sarvarta/status/2038217966639276400
ఎవరీ కణిమొళి సంతోష్?
ఈమె కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, ఒక సెలబ్రిటీ జ్యోతిష్యురాలు. ముఖ్యంగా యూట్యూబ్‌లో ఈమెకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. జ్యోతిష్యం, వాస్తు, లవ్ స్పెషలిస్ట్ గా ఈమెకు మంచి గుర్తింపు ఉంది. విజయ్ రాజకీయాల్లోకి రాకముందే, ఆయన జాతకం ప్రకారం పెద్ద నాయకుడు అవుతారని ఈమె అనేక వీడియోల్లో జోస్యం చెప్పారు.
https://twitter.com/MoviesSingapore/status/2038226536537706672
చాలా మందికి వస్తున్న సందేహం ఇదే.. ఒక జ్యోతిష్యురాలికి విజయ్ ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కణిమొళి సంతోష్‌కు మహిళల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె చెప్పే జ్యోతిష్య కార్యక్రమాలను ఫాలో అయ్యే మహిళా ఓటర్లను పార్టీ వైపు తిప్పుకోవచ్చని TVK ప్లాన్ చేస్తోంది.
విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో జ్యోతిష్యాన్ని బాగా నమ్ముతున్నారని, కీలక నిర్ణయాల కోసం ఆమె సలహాలు తీసుకుంటున్నారని టాక్. పార్టీ జెండా రంగుల నుండి, పార్టీ లాంచ్ టైమింగ్ వరకు ఈమె సూచనలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాది కీలక పాత్ర. ఆమెకున్న డిజిటల్ ఫాలోయింగ్‌ను పార్టీ ప్రచారానికి వాడుకోవచ్చని విజయ్ భావిస్తున్నారట. చూడాలి మరి ఈమె ప్రభావం ఎంత మేరకు ఉంటుందో.
