Morticia Addams: ఒకప్పుడు ఆ దేశంలో ఆయన మాటే శాసనం.. ఆయన ఫోటోను అవమానిస్తే మరణశిక్షే గతి! కానీ, నేడు అదే వ్యక్తి మరణవార్త విన్న ఒక మహిళ, కెనడా వీధుల్లో చిందులేస్తూ సంబరాలు చేసుకుంటోంది. ఆమె మరెవరో కాదు.. గత జనవరిలో ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సమయంలో, ఖమేనీ ఫోటోను తగలబెట్టి.. ఆ మంటతో తన సిగరెట్ వెలిగించుకున్న దృశ్యంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన మోర్టిసియా ఆడమ్స్.
گفتم سر قبرتون میرقصیم نگفتم؟#KingRezaPahlavi pic.twitter.com/XkI3m7oYN3
— Morticia Addams 🇮🇷 (@melianouss) February 28, 2026
“నీ సమాధిపై డ్యాన్స్ చేస్తానని చెప్పాను కదా.. అన్నంత పని చేశాను!” అంటూ ఆమె తాజాగా ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇరాన్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇరాన్ నుంచి ప్రాణ భయంతో పారిపోయి, ప్రస్తుతం కెనడాలో శరణార్థిగా ఉంటున్న ఈ మహిళ, ఖమేనీ మరణాన్ని ఒక పీడకల ముగింపుగా అభివర్ణించింది..
Cheers to mooshali’s pathetic death 🥂
As the president Trump said “He died like a rat 🐀” pic.twitter.com/LeV6mdX581— Morticia Addams 🇮🇷 (@melianouss) March 1, 2026
ఎవరీ మోర్టిసియా ఆడమ్స్?
ఇరాన్లో ఉన్నప్పుడు ప్రభుత్వంపై గళమెత్తినందుకు అరెస్ట్ అయ్యి, ఎన్నో హింసలను అనుభవించిన ఈమె, అక్కడి నుంచి టర్కీకి, ఆ తర్వాత కెనడాకు చేరుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా తన అసలు పేరును బయటపెట్టని ఈమె, ఖమేనీ ఫోటోతో సిగరెట్ వెలిగించిన వీడియో అప్పట్లో ఇరాన్ యువతలో ఒక పెద్ద విప్లవాన్నే తెచ్చింది. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించడాన్ని ప్రస్తావిస్తూ.. ట్రంప్ చెప్పినట్లే, ఆయన ఒక ఎలుకలా చనిపోయాడు అంటూ ఘాటుగా విమర్శించింది.
