Wasim Akram : పాకిస్థాన్ నిఘా సంస్థ ISIకు గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై యూట్యూబర్ వసీం అక్రమ్ ను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్వాల్ జిల్లాలోని కోట్ గ్రామానికి చెందిన నిందితుడు గత మూడేళ్లుగా పాకిస్థాన్ ఏజెంట్లతో టచ్ లో ఉన్నాడని అధికారులు తెలిపారు.
BREAKING : Another traitor in the net, hand-in-glove with enemy intelligence. Haryana Police arrested YouTuber Wasim Akram from Palwal for spying on India & leaking secrets to Pakistan’s ISI! pic.twitter.com/SUAJbyjBn0
— Baba Banaras™ (@RealBababanaras) October 3, 2025
వారికి సిమ్ కార్డులు కూడా సమకూర్చాడని చెప్పారు. వసీం అక్రమ్ వాట్సప్ లో పోలీసులు అనుమానాస్పద చాటింగ్ లను గుర్తించారు. వాటిలో కొన్నింటిని డిలీట్ చేసినట్లు కనుగొన్నారు. తొలగించిన చాటింగ్ ల పునరుద్ధరణకు సైబల్ సెల్ పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.
పాక్ కు గూఢచర్యం చేస్తున్నాడని గత వారం పల్వాల్ జిల్లా పోలీసులు తౌఫిక్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు తాజాగా వసీం అక్రమ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్ కాల్స్ ద్వారా తౌఫిఖ్, అక్రమ్, పాక్ హైకమిషన్ అధికారులతో పాటు ISI ఏజెంట్లతో టచ్ లో ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని చెప్పారు..