పోయిన ప్రాణాలకు బాధ్యులెవర్రా ..? ఆ కుటుంబాల ఉసురు తగుల్తది ?

పోయిన ప్రాణాలకు బాధ్యులెవర్రా ..? ఆ కుటుంబాల ఉసురు తగుల్తది ?

41 రోజుల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు…ఇవాళ విమరించారు. హైకోర్టు సూచన మేరకు లేబర్ కోర్టులో మాకు న్యాయం జరుగుతుందన్న పూర్తి విశ్వాసముందన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వద్ధామరెడ్డి. డిమాండ్ల పరిష్కారం కోసం 41 రోజులు కార్మికులు సమ్మె చేసినా… ప్రభుత్వం నుంచి సానుకూలత రాలేదు. ఆఖరికి హైకోర్టు కల్పించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. లేబర్ కోర్టుకు చేరిన సమ్మె కేసు విచారణ పూర్తికావాడానికి దాదాపుగా రెండు నుంచి మూడు నెలలు పట్టొచ్చని అశ్వద్ధామరెడ్డే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక సమ్మె కొనసాగించడం బావ్యం కాదని… సమ్మె విరమిస్తున్నామని… మా కార్మికులకు ఎలాంటి షరతులు పెట్టకుండా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అశ్వద్ధామరెడ్డిపై నెటిజన్లు ఫైర్

సమ్మె విరమిస్తున్నామన్న ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వథ్థామరెడ్డిపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. “చేతకానప్పుడు సమ్మె చేయడం ఎందుకు…? అమాయకపు కార్మికులను రెచ్చగొట్టి…. ఎంతోమంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నావ్… ఇప్పుడాళ్ల కుటుంబాలకు దిక్కెవరు ? రోడ్డునపడ్డ కార్మిక కుటుంబాలను ఆదుకునేది ఎవరు ? చనిపోయిన వారి కుటుంబాల ఉసురు నీకు తగులుతుంది… ఇన్నాళ్లు సమ్మె చేసిన కార్మికుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయింది. ప్రభుత్వం ఇప్పుడాళ్లను విధుల్లోకి తీసుకుంటుందో లేదో తెలువదు ? తీసుకున్నా ఎలాంటి షరతులు పెడుతుందో తెలియదు ? అసలు ఎవరి కోసం ఈ సమ్మె చేశావ్…నీ ఎదుగుదల కోసం కార్మికులను రెచ్చగొట్టి లాభం పొందాలని చూశావ్” అంటూ సోషల్ మీడియాలో అశ్వథ్థామరెడ్డిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *