Upcoming Smartphones 2026 : ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? ఒక్క వారం ఆగండి.. మార్కెట్లోకి 3 అదిరిపోయే ఫోన్లు!

Upcoming Smartphones in January 2026

Upcoming Smartphones 2026 : కొత్త మొబైల్ కొందామని ఫిక్స్ అయ్యారా? అయితే మీకో గుడ్ న్యూస్. వచ్చే వారం రోజుల్లో మార్కెట్లోకి మూడు క్రేజీ స్మార్ట్‌ఫోన్లు(Upcoming Smartphones 2026 ) రాబోతున్నాయి. మోటోరొలా, వివో, రియల్‌మీ లాంటి పెద్ద కంపెనీలు తమ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ మూడు కూడా ఫ్లిప్‌కార్ట్ లోనే దొరుకుతాయి. అవేంటో, వాటి స్పెషాలిటీస్ ఏంటో ఒకసారి చూసేయండి..

1. మోటోరొలా సిగ్నేచర్ (జనవరి 23)

జనవరి 23న మోటోరొలా నుంచి సిగ్నేచర్ మోడల్ వస్తోంది. మోటో ఫోన్లు అంటేనే మనకు తెలిసిందే.. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఇందులో క్లీన్ ఆండ్రాయిడ్ ఉంటుంది కాబట్టి అడ్వర్టైజ్‌మెంట్స్ గోల ఉండదు. మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వస్తోంది కాబట్టి, ఫోన్ వాడేటప్పుడు అస్సలు హ్యాంగ్ అవ్వదు. లుక్ ప్లస్ స్పీడ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

2. వివో ఎక్స్‌200టీ (జనవరి 27)

మీకు ఫోటోలు తీయడం అంటే ఇష్టమా? అయితే జనవరి 27 వరకు ఆగండి. వివో తన కొత్త ఫోన్ Vivo X200Tని లాంచ్ చేస్తోంది. వివో కెమెరా క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రాత్రిపూట ఫోటోలు కూడా డే టైమ్‌లో తీసినట్టే చాలా క్లియర్ గా వస్తాయని కంపెనీ చెబుతోంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కావాలనుకునే వారు దీనిపై ఒక కన్నేసి ఉంచండి.

3. రియల్‌మీ పీ4 పవర్‌ 5జీ (జనవరి 29)

జనవరి 29న రియల్‌మీ నుంచి P4 Power 5G మార్కెట్లోకి వస్తోంది. దీని పేరులోనే ‘పవర్’ ఉంది. అంటే బ్యాటరీ మామూలుగా ఉండదు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎక్కువ కాలం వస్తుంది, పైగా చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోతుంది. తక్కువ బడ్జెట్‌లో మంచి 5జీ ఫోన్ కావాలి, బ్యాటరీ ఎక్కువ రావాలి అనుకునే వారికి ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది.