Best Bikes :కొత్త బైక్ కొనాలనుకేవారు ముందుగా చూసేది తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చేది. దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని బడ్జెట్-ఫ్రెండ్లీ బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మోడళ్లు తక్కువ మెయింటెనెన్స్‌తో, శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తూ, కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
హోండా షైన్ 100
స్టైలిష్ లుక్ తో తక్కువ ధరకే లభించే అత్యుత్తమ బైక్ హోండా షైన్ 100.
ఫీచర్లు: ఇంజిన్: 98.98cc, పవర్: 7.38 bhp, మైలేజ్: 55-60 km/l, ధర: రూ. 63,191 (ఎక్స్-షోరూమ్).
హీరో HF డీలక్స్
తక్కువ ధరకు లభించే అత్యుత్తమ బైక్‌లలో ఇది ఒకటి.
ఫీచర్లు: ఇంజిన్: 97.2cc, పవర్: 7.91 bhp, మైలేజ్: సుమారు 70 కి.మీ/లీ, ధర: రూ. 58,020 (ఎక్స్-షోరూమ్).
బజాజ్ ప్లాటినా 100
మంచి మైలేజ్, తక్కువ ధర, మరిన్ని ఫీచర్లు కోరుకునే వారికి బజాజ్ ప్లాటినా 100 మంచి ఆప్షన్.
ఫీచర్లు: 102cc ఇంజిన్, 70 km/l మైలేజ్, ధర: రూ. 65,407 (ఎక్స్-షోరూమ్).
టీవీఎస్ రేడియన్
TVS Radeon ప్రీమియం లుక్,గొప్ప ఫీచర్లతో వస్తుంది.
ఫీచర్లు: 109.7cc ఇంజిన్, 68.6 km/l మైలేజ్, ధర: రూ. 66,300 (ఎక్స్-షోరూమ్), USB ఛార్జర్ చేర్చబడింది.
టీవీఎస్ స్పోర్ట్
టీవీఎస్ స్పోర్ట్ బైకర్లకు మరో మంచి ఆప్షన్.
ఫీచర్లు: 109.7cc ఇంజిన్, 70 km/l మైలేజ్, ధర: రూ. 58,200 (ఎక్స్-షోరూమ్), USB ఛార్జింగ్ పోర్ట్.
పైన పేర్కొన్న ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరలు. ఆన్-రోడ్ ధరలు, మైలేజ్ అంచనాలు ప్రాంతం, ఇంధనం నాణ్యత, డ్రైవింగ్ పరిస్థితులను బట్టి మారవచ్చు.