BSNL సంచలన ఆఫర్.. రూపాయికే అన్‌లిమిటెడ్

bsnl

BSNL : జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు ఇటీవల రీఛార్జ్ ధరలను దారుణంగా పెంచేశాయి. ఈ క్రమంలో వాటికి పోటీగా నిలిచేందుకు, ధరలను తగ్గించి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఓ సంచలన ఆఫర్ తో ముందుకు వచ్చింది.

దీపావళి ఆఫర్ అంటూ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. కేవలం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయికే సిమ్‌కార్డు ఫ్రీగా అందించడమే కాకుండా… అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది.

ఇంతకీ ఆ ఆఫర్ లు ఏంటంటే… రూపాయికే ఫ్రీ సిమ్ తో పాటుగా 30 రోజులు వ్యాలిడిటీతో రోజుకు 2 GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా అందిస్తుంది.

ఈ ఆఫర్‌ను పొందాలనుకునే వారు తమ సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా అధీకృత రిటైలర్‌ను సంప్రదించవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా BSNL తన స్వదేశీ 4G నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఈ ఆఫర్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.