One lakh rupees chitti Calculation : రూ. లక్ష చిట్టి వేస్తున్నారా? ఎప్పుడు ఎత్తుకుంటే లాభమో తెలుసా? ఈ లెక్క చూడండి!

Lakh Rupala Chitti Profit and Loss)

One lakh rupees chitti Calculation :  మన తెలుగు రాష్ట్రాల్లో పొదుపు అనగానే అందరికి గుర్తొచ్చేది చిట్టి. మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్లిళ్లు, ఇల్లు కట్టడం లేదా బిజినెస్ పెట్టుబడి కోసం చిట్టినే నమ్ముకుంటారు. అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే.. చిట్టిని ఏ నెలలో ఎత్తుకుంటే లాభం ఉంటుంది? అసలు లెక్కలు ఎలా వేసుకోవాలి? ఓ లక్ష రూపాయల చిట్టిని(One lakh rupees chitti Calculation ) మనం 20 నెలల కడతాం. ఉదాహరణతో అసలు లెక్కలు చూద్దాం.

చిట్టి మొదలైన 2 నుండి 5 నెలల లోపే చిట్టిని ఎత్తుకుంటే.. లక్ష రూపాయల చిట్టిలో పోటీ ఎక్కువగా ఉంటే రూ. 30,000 వరకు పాట పాడతారు అనుకుందాం. అప్పుడు మీకు చేతికి వచ్చేది రూ. 70,000 మాత్రమే. మీరు కట్టేది లక్ష రూపాయలు, కానీ చేతికి వచ్చింది రూ. 70,000. అంటే సుమారు రూ. 30,000 నష్టం (వడ్డీ కింద కట్టినట్టు).

అయితే ఇది ఎవరికి మంచిదంటే.. అత్యవసరంగా ఇంట్లో ఎవరికైనా ఆపరేషన్ ఖర్చులు ఉన్నా లేదంటే 2 రూపాయల కంటే ఎక్కువ వడ్డీకి తెచ్చిన అప్పులు తీర్చాలన్నా ఇలా మొదట్లో ఎత్తుకోవడం మంచిది. ఎందుకంటే బయట వడ్డీ కంటే చిట్టి పాట రూపాయిగా ఉంటుంది.

మధ్యలో ఎత్తుకుంటే లాభమా?

మనం కట్టిన చిట్టి 10 నుండి 12 నెలలు గడిచాక ఎత్తుకోవడం మంచిదేనా.. ఈ లెక్క కూడా చూద్దాం. అప్పటికి పాట పాడే వారి సంఖ్య తగ్గుతుంది కాబట్టి… పాట సుమారు రూ. 10,000 – 15,000 కే వచ్చేస్తుంది. అప్పుడు మీకు చేతికి రూ. 85,000 నుండి 90,000 వరకు వస్తుంది. లాభం పరంగా చూస్తే మీరు కట్టే మొత్తానికి, మీకు వచ్చే మొత్తానికి పెద్దగా తేడా ఉండదు. ఇది ఎవరికి మంచిదంటే ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా లేదా స్థలం కొనే ప్లాన్ ఉన్నా.. ఈ సమయంలో ఎత్తుకోవడం చాలా తెలివైన పని.

పోని చివర్లో ఎత్తుకుంటే లాభమా? అంటే ఈ లెక్క కూడా చూద్దాం. అప్పటికి పాట ఉండదు కాబట్టి దాదాపు పూర్తి లక్ష రూపాయలు మీ చేతికి వస్తాయి.అంటే చివర్లో లక్షతో పాటుగా మీకు రూ. 15, వేల నుంచి 17 వేల వరకు లాభం (వడ్డీ) వస్తుంది. ఇది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువే.  డబ్బును పొదుపు చేసి రిటర్న్స్ పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లాన్.

చిట్టి నడిపే వ్యక్తి 5% వరకు కమీషన్ తీసుకుంటారు, అది కూడా మీ లెక్కలో చూసుకోకండి. అత్యవసరమైతే మొదట్లో, పెట్టుబడి కోసం అయితే మధ్యలో, పొదుపు కోసం అయితే చివర్లో చిట్టి ఎత్తుకోవడం మంచిది. మీ అవసరాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి.

Also Read :