Goa : గోవాకు వెళ్తే ఒళ్లు జాగ్రత్త.. ప్రైవేటు వీడియోలు తీసి!

goa

Goa :గోవాకు వెళ్లే జంటలు తస్మా్త్ జాగ్రత్త.. దారుణమైన ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మహిళను గోవాకు చెందిన ఒక హోటల్ యజమాని బ్లాక్‌మెయిల్ చేశాడు. బాధితురాలు తన పెళ్లికి ముందు 2023లో ఒక వ్యక్తితో కలిసి గోవా వెళ్ళింది. అక్కడ వారికి ఉండటానికి బస, ఇతర ఏర్పాట్లు చేశాడో యశ్వంత్ (40) అనే వ్యక్తి.

అంతబాగా చూసుకున్నాడు. ఆ యువతి హైదరాబాద్ కు వచ్చాక ఊహించని షాకిచ్చాడు. ఇటీవల ఆమెకు ఫోన్ చేసి గతంలో గోవాకు వచ్చిన యువకుడితో సన్నిహితంగా ఉన్న వీడియోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని బయటపెట్టకుండా ఉండాలంటే రూ.30 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.

ప్రస్తుతం తనకు వేరే వ్యక్తితో పెళ్లయిందని, తన వైవాహిక జీవితం చెడిపోతుందని, దయచేసి వదిలేయమని ఆ యువతి వేడుకున్నా యశ్వంత్ వినకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సనత్‌నగర్ పోలీసులు తెలిపారు.