Hardik Pandya : టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన వేళ.. మైదానంలో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకోవడమే కాకుండా, సొంత గడ్డపై ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ ఆనంద సమయంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మకు సంబంధించిన ఒక రొమాంటిక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Hardik Pandya fell asleep on the podium with his girlfriend. 😭🤣
That’s some next-level love.😂 pic.twitter.com/iw6X3sqfTq
— Rohan💫 (@rohann__45) March 9, 2026
న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో భారత్ 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గెలుపు ఖాయమైన వెంటనే మాహికా శర్మ మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి హార్దిక్‌ను గట్టిగా వాటేసుకుంది. అంతేకాకుండా హార్దిక్ బుగ్గపై ముద్దు పెట్టి తన ప్రేమను చాటుకుంది. భారత త్రివర్ణ పతాకాన్ని కప్పుకుని వీరిద్దరూ కలిసి చేసిన డాన్స్ అభిమానుల మనసు గెలుచుకుంది. ఒకానొక దశలో వీరిద్దరూ స్టేజీపై పడుకుని సేద తీరుతున్న విజువల్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. దీంతో నెటిజన్లు పాండ్యాను ఏకిపారేస్తున్నారు. అది బెడ్రూమ్ అనుకున్నావా అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్లతో విరుచుకపడుతున్నారు.
మ్యాచ్ అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాహికా తన జీవితంలోకి వచ్చాకే అదృష్టం కలిసొచ్చిందని, ఆమె తన ‘లక్కీ చార్మ్’ అని చెప్పుకొచ్చారు. నతాషా స్టాంకోవిచ్‌తో విడాకుల తర్వాత గత ఏడాది కాలంగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ టోర్నమెంట్ జరిగిన 45 రోజుల పాటు మాహికా ప్రతి మ్యాచ్‌లోనూ హార్దిక్‌కు మద్దతుగా నిలిచింది.
ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరిచారు. బ్యాట్‌తోనూ, బంతితోనూ సత్తా చాటారు. 9 మ్యాచుల్లో 160.74 స్ట్రైక్ రేట్‌తో 217 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్‌లో 9 వికెట్లు పడగొట్టి టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలు గెలవడమే తన లక్ష్యమని హార్దిక్ ధీమా వ్యక్తం చేశారు.
