Rice : మూడు పూటల అన్నమే తింటున్నారా.. డేంజర్లో ఉన్నట్టే!

తెలుగు రాష్టాల్లో ఎక్కువగా బియ్యాన్ని అన్నంగా వండుకుని తింటారు. చపాతీలు తదితర టిఫిన్స్ చేసుకున్నప్పటికీ ప్రధానంగా అన్నం తినడం అనేది ఉంటుంది. అయితే మూడు పూటలు అన్నమే తింటే మంచిదా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది.

మూడు పూటలు అన్నం తినడం వలన లాభాల కంటే ఎక్కువగా నష్టాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. అన్నం తినగానే బాడీలో గ్లూకోజ్ స్థాయిలో వేగంగా పెరుగుతుంది. డయాబెటిక్ రోగులు, అధిక బరువు ఉన్నవారు మాత్రం  ఈ పద్దతిని మార్చుకోవాలని సూచిస్తున్నారు.

అన్నం తినడానికి ఒక నిర్ణీత సమయాన్ని పాటించడం మంచిది. ఉదయం అల్పాహారం 8 గంటల లోపు, మధ్యాహ్నం భోజనం 1గంట నుంచి 2 గంటల మధ్య, రాత్రి భోజనం 8 గంటల లోపు తినడం ఆరోగ్యానికి మంచిది.
బరువు తగ్గాలని అనుకునేవారు,  డయాబెటిక్ ఉన్నవారు రాత్రి చపాతీ తింటే మంచిది. రోజుకు ఎన్నిసార్లు తింటున్నామో అన్నదాని కంటే ఎంత తింటున్నామో అనేది చాలా ముఖ్యం. కడుపు నిండా కాకుండా, సగం కడుపు మాత్రమే తినడం మంచిది.
కేవలం అన్నం ఒక్కటే కాకుండా అన్నంతో పాటు కూరగాయలు, పప్పులు, పెరుగు, పండ్లు వంటివి ఉండేలా చూసుకోవాలి. అన్నం ఒక్కటే కాకుండా అన్ని పోషకాలు శరీరానికి అందాలి.
ఇక తీసుకున్న ఆహారానికి తగ్గట్టుగా వ్యాయామం అనేది కచ్చితంగా ఉండాలి. లేకపోతే, శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఇన్సులిన్ పెరుగుతుంది. ఇది షుగర్‌కు కారణం అవుతుంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి.