Harish Rao: కవిత సస్పెన్షన్ ఇప్పుడు బీఆర్ఎస్ లో పెద్ద సంచలనంగా మారింది. పార్టీలోని కీలక నేత అయిన హరీష్ రావు రావుపై ఆమె ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద అవినీతి కొండ అంటూ బాంబు పేల్చారు. దీంతో కవితను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ దేవుడైనప్పటికీ ఆయన పక్కన కొన్ని దెయ్యాలు ఉన్నాయంటూ కవిత సంచలన కామెంట్స్ చేసినప్పటికీ కేసీఆర్ చాలా ఓపికతో ఉన్నారు. తాజాగా కవిత ఏకంగా హరీష్ రావుపై అందులోనూ అవినీతి చేశాడంటూ కీలకమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తద్వారా పార్టీపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో పార్టీ చీఫ్ కేసీఆర్ కవితను సస్పెండ్ చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పార్టీలో ఒక కీలకమైన చర్చ నడుస్తుంది. పార్టీలో సీనియర్ నేతైన హరీష్ రావు పై ఎవరైనా రెచ్చిపోయి ఏ మాత్రం వ్యాఖ్యలు చేస్తే వారి పని అంతే అనే చర్చ నడుస్తుంది. గతంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు .. హరీష్ రావు పై తీవ్రమైన ఆరోపణ చేశారు. అప్పుడు పార్టీ అంతా ఆయనకు సపోర్ట్ గా నిలిచింది. దీనిపై కేసీఆర్ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పార్టీకి ఎవరూ యాంటీగా వెళ్లిన తీసి పారేస్తమని అన్నారు. ఎంత పెద్ద వ్యక్తులైన సస్పెండ్ చేస్తామని అప్పుడే హెచ్చరించారు. పాపం అలాంటిది ఇప్పుడు ఆయన కూతురుకి అలాంటి పరిస్థితి రావడం గమనార్హం.