Newly Married: కర్ణాటకలోని బెలగావిలో దారుణం జరిగింది.. ఓ వ్యక్తి పెళ్లైన నాలుగు నెలలకే తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఇంట్లో మంచం కింద దాచిపెట్టి పారిపోయాడు. ఆకాష్ మూడు రోజుల క్రితం సాక్షిని హత్య చేసి పారిపోయాడని పోలీసులు తెలిపారు.. హత్య జరిగినప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకాష్ కంబర్ అనే వ్యక్తికి నాలుగు నెలల క్రితం సాక్షి(20) అనే యువతితో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో భార్యను చంపేసి పారిపోయాడు. నిందితుడు ఆకాష్ కంబర్ తల్లి తన స్వగ్రామం నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆమెకు 20 ఏళ్ల సాక్షి కంబర్ మృతదేహం కనిపించింది.
పోలీసులు కేసు నమోదు చేసి ఆకాష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్య వెనుక గల ఉద్దేశ్యం ఇంకా తెలియనప్పటికీ ఆకాష్ కుటుంబం వరకట్న వేధింపులకు గురిచేశారని తెలుస్తోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో వరకట్నం కోసం గర్భిణీ స్త్రీని ఆమె భర్త, అత్తమామలు కొట్టి చంపేశారు. కొన్ని రోజుల తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం, 2023లో వరకట్న సంబంధిత నేరాల కింద నమోదైన కేసులు 14 శాతం పెరిగాయి, దేశవ్యాప్తంగా 15,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఏడాది పొడవునా 6,100 కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. NCRB నివేదిక ప్రకారం 2023లో వరకట్న నిషేధ చట్టం కింద 15,489 కేసులు నమోదయ్యాయి – 2022లో 13,479, 2021లో 13,568 కేసులు నమోదయ్యాయి.
Also Read ;
-
BJP అభ్యర్థిగా బొంతు రామ్మోహన్.. ఇదిదా ట్విస్ట్!
-
Telangana : జీవో 9పై హైకోర్టు స్టే.. ప్రభుత్వం ముందు నాలుగు ఆప్షన్స్!