PMMY : ఎలాంటి షూరిటీ లేకుండా రూ.20 లక్షల లోన్.. అస్సలు మిస్ అవ్వొద్దు!  

PMMY :  దేశంలో మోదీ సర్కార్ వచ్చాక చాలా మంచి స్కీమ్స్ అమలు చేస్తుంది. అందులో ఒకటి పీఎం ముద్రా యోజన (PMMY). జాబులు వద్దు ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ స్కీమ్.  రూ. 50,000 నుండి రూ. 10 లక్షల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా  రుణాలు ఇస్తారు. అయితే ఇవి సక్రమంగా కడితే రూ.  20లక్షల వరకు కూడా రుణాలు తీసుకోవచ్చు.
మాములుగా బ్యాంకులో లోన్ కావాలంటే ఇల్లు లేదా ల్యాండ్ కాగితాలు షూరిటీగా  అడుగుతారు. కానీ ముద్రా యోజనలో అవేమీ అవసరం లేదు. మీ వ్యాపార ఆలోచన బాగుంటే చాలు, ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి మీకు లోన్ ఇప్పిస్తుంది. ముఖ్యంగా మహిళలు, చిన్న వ్యాపారులకు ఈ పథకం ఒక వరప్రదాయినిగా మారింది.

ఈ పథకాన్ని మూడు విభాగాలుగా డివైడ్ చేశారు.  

  • శిశు (Shishu): కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారికి రూ. 50,000 వరకు లోన్ ఇస్తారు.
  • కిషోర్ (Kishore): ఉన్న వ్యాపారాన్ని డెవలప్ రూ. 5 లక్షల వరకు ఇస్తారు.
  • తరుణ్ (Tarun): వ్యాపార విస్తరణ కోసం రూ. 10 లక్షల వరకు ఇస్తారు. సక్రమంగా చెల్లించే వారికి ఇటీవలే దీనిని రూ. 20 లక్షలకు పెంచారు.
కిరాణా కొట్టు, బ్యూటీ పార్లర్, టైలరింగ్ షాప్ పెట్టుకునే వారు, ఆటోలు, టాక్సీలు కొనుగోలు చేసే డ్రైవర్లు, పాపడాలు, పచ్చళ్లు, హస్తకళలు నడిపేవారు. కూరగాయలు, పండ్ల వ్యాపారులు దీనికి అర్హులు.  మీకు దగ్గరలోని ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకును సంప్రదించి, మీ వ్యాపార వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో Udyamimitra పోర్టల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. లోన్ మంజూరైన తర్వాత ముద్రా కార్డు’ (RuPay Debit Card) కూడా ఇస్తారు. దీనితో మీరు వ్యాపార అవసరాలకు కావలసినప్పుడు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. తీసుకున్న లోన్ 3 నుండి 5 సంవత్సరాల లోపు తిరిగి చెల్లించాలి.  బ్యాంకుల నిబంధనల ప్రకారం వడ్డీ రేటు ఉంటుంది.  సాధారణంగా 9% నుండి 12% వరకు ఉండవచ్చు.
  • గుర్తింపు కార్డు (ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి).
  • చిరునామా పత్రాలు (కరెంట్ బిల్లు, రేషన్ కార్డ్).
  • వ్యాపార ప్రణాళిక (Business Plan/Project Report).
  • మీ ఫోటోలు.