Shiva Jyothi: వీ6 యాంకర్ గా, సావిత్రక్కగా బాగా ఫేమస్ అయింది శివజ్యోతి. సొంతూరులో బీడీలు చేసుకునేటప్పటి నుంచి జర్నలిజం ప్రపంచంలోకి అడుగుపెట్టి అక్కడి నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు ఆమె ప్రయాణం చాలా అద్భుతమనే చెప్పాలి.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని నాగంపేట గ్రామంలో యశోద, రాజమల్లేష్ దంపతులకు జన్మించింది.శివజ్యోతి తన తన ప్రాధమిక విద్యను తన సొంత గ్రామంలోనే పూర్తి చేశారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత, హైదరాబాద్‌లోని ఒక కళాశాలలో BSc నర్సింగ్‌లో చేరారు. మధ్యలోనే వదిలేసి, ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసింది. ఇంట్లో ఆమె బీడీలు చేసేవారు కూడా
శివజ్యోతి వివిధ ఛానెల్స్‌లో యాంకర్‌గా ప్రయత్నించారు. కానీ ఆమె తెలంగాణ యాస, గొంతు మీడియాకు సరిపోదని కొన్ని ఛానెళ్లు రిజెక్ట్ చేశాయి. V6 ఛానెల్‌లో తెలంగాణ యాసలో వార్తలు చదివేవారి కోసం జరిగిన ఆడిషన్స్‌లో శివజ్యోతి సెలక్ట్ అయింది.
V6లో చేరిన తర్వాత, ఆమె మొదట సినిమా వార్తలు చదివారు. ఆ తర్వాత ‘తీన్మార్’ వార్తల కార్యక్రమంలో బిత్తిరి సత్తితో కలిసి పనిచేసి ‘తీన్మార్ సావిత్రి’గా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందారు.
తీన్మార్ వార్తలలో జ్యోతి వేసుకున్న బుగ్గల జాకెట్ చాలా ఫేమస్, ట్రెండ్ అయింది. కొందరు సావిత్రి జాకెట్లు అని పేరు కూడా పెట్టారు.
ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.అనంతరం టీవీ9లో కూడా ఆమె కొంతకాలం పనిచేశారు.
ప్రస్తుతం ఆమె ‘జ్యోతక్క’ అనే తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. ఇన్ స్టా, ఫేస్ బుక్ లో ఆమెకు మంచి ఫాలోవర్లు ఉన్నారు. చాలా బ్రాండ్లను ఆమె ప్రమోట్ చేస్తున్నారు కూడా.
శివజ్యోతి తన చిన్ననాటి స్నేహితుడైన గంగులును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఆమె కుటుంబం నుంచి మొదట్లో వ్యతిరేకత ఎదురైంది. అయితే చివరకు ఒప్పించి ఒక్కటయ్యారు.