Khammam: రౌడీ షీటర్ వేధింపులను తట్టుకోలేక ఓ వివాహిత అత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెంకు చెందిన సుశీల శివకుమార్‌తో పెళ్లైంది.వీరికి ఓ కొడుకు ఉన్నాడు. సుశీల ఇంటి ఎదుటే రౌడీ షీటర్ ధరావత్ వినయ్ ఉంటున్నాడు.
సుశీలపై కన్నేసిన వినయ్ పలుమార్లు తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో సుశీల మరో మహిళతో కలిసి పొలం పనికి వెళ్లగా అక్కడికి రౌడీ షీటర్ ధరావత్ వినయ్ వచ్చాడు. అక్కడ కూడా తన కోరిక తీర్చాలంటూ సుశీలను బలవంతంగా కారులో ఎత్తుకెళ్లాడు. సుశీలపై దాడి చేస్తూ వినయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
రౌడీ షీటర్ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండా గ్రామం నుండి మరో మహిళతో కలిసి, పత్తి ఏరడానికి అమ్మపాలెం గ్రామానికి వెళ్లిన బోడ సుశీల(28) అనే వివాహిత పొలంలో ఉన్న సుశీల వద్దకు వెళ్లి తన కోరిక తీర్చాలని వేధించిన రౌడీ pic.twitter.com/PV5i4PaEmQ
— dktimestelugu (@dktimestelugu) October 22, 2025
సుశీల తీవ్రంగా ప్రతిఘటించి అతని నుంచి తప్పించుకుంది. రౌడీ షీటర్ వినయ్ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన సుశీల ఇంటికి తిరిగి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రౌడీ షీటర్ వినయ్ వేధింపులు, దాడితోనే తన భార్య ఆత్మహత్య చేసుకుందని తన ఫిర్యాదులో వెల్లడించాడు శివకుమార్.
కాగా నిందితుడు ధరావత్ వినయ్‌పై నెల రోజుల క్రితమే రౌడీ షీట్ తెరిచినట్లు ఇన్‌స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.సుశీల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, కలకలాన్ని సృష్టించింది.
