మహారాష్ర్ట, హర్యానాలో ఎన్నికల ప్రచారం అలా జరిగిపోతుంది. బీజేపీ కాంగ్రెస మధ్యే అసలు పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్ తమ ప్రచారాన్ని అంతగా చేయలేకపోతోంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీకే విజయవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వాలు కూడా బీజేపీయే కావడంతో మళ్లీ అక్కడ వారికే అధికారం దక్కనుంది. దీంతోకాంగ్రెస్ నామ మాత్రంగా ప్రచారం చేస్తోంది. ఇక రాహుల్ గాంధీ మాత్రం ఆ రెండు రాష్ట్రాల వైపు మొన్నటి వరకు కన్నెత్తి కూడా చూడలేదు….
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఆర్టీసీ సమ్మె సెగ… నిలదీసిన ఉద్యమకారులు…
సుద్దాల హనుమంతు ఫౌండేషన్ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పురస్కారాన్ని ఆర్.నారాయణ మూర్తికి అందజేశారు. అప్పటి వరకు బానే ఉన్నా…కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఫైర్ అయ్యారు. కార్య్రమం ముగించుకుని బయటకు వెళుతున్న సమయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం లేవనెత్తారు. ప్రభుత్వం వారి విషయంలో అమానుషంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం…
రైతులకు జగన్ మరో వరం…
ఏపీ సీఎం జగన్ రైతులకు మరో వరం ప్రకటించారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచారు. రైతు భరోసా అమలు సమయాన్ని కూడా నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. దీంతో ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ. 67,500 పెట్టుబడి సాయం రైతులకు అందనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు అదనంగా రూ. 17,500 పెట్టుబడి సాయం లభించనుంది. ఇప్పటికే రైతు భరోసా…
కేసీఆర్… హుజూర్ నగర్ సభ అనుమానమే ? ఇవే కారణాలు….
ఓ వైపు ఆర్టీసీ సమ్మె. మరో వైపు ముంచుకొస్తున్న హుజూర్ నగర్ ఉపఎన్నిక పోలింగ్. రెండూ…అధికార పార్టీకి కత్తిమీద సామే అయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో హుజూర్ నగర్ లో జరిగే బహిరంగ సభలకు కేసీఆర్ వస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ రావడం లేదు. అధికార పార్టీ నేతలు సీఎం వస్తారనే చెబుతున్నారు కానీ… భద్రత చూసుకోవాల్సిన పోలీసులకు మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం అందలేదు. సో… ఈ లెక్కన…
నీ సీటు అడిగినమా..? మంత్రి పోస్టడిగినమా ? నీ ఫామౌజుల భాగము మేం అడిగినమా ?
ఆర్టీసీ సమ్మె ఉధృతంగా మారిన వేళ… తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ వ్యతిరేక నినాదాలు వినిపస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులకు వివిధ రంగాల నుంచి మద్ధతు ప్రకటిస్తున్నాయి. సమ్మెపై కేసీఆర్ వైఖరి పట్ల ఓ కళాకారుడు పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నీ సీటడిగినమా ? మంత్రి పోస్టడిగినమా ? నీ ఫామౌజుల భాగము మేం అడిగినమా ? అంటూ పాడిన పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ కళాకారుడు పాడిన…
rtc strike : మరో కండక్టర్ ఆత్మహత్యాయత్నం… బ్లేడ్ తో కోసుకున్నాడు..
ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నా…ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలత లేదు. పైగా విధులకు హాజరుకాకుంటే ఉద్యోగాలు ఉండవనే వార్నింగులు. దీంతో కార్మికులు మనస్థాపానికి గురవుతున్నారు. ఉద్యోగాన్ని వదులుకోలేక, విధుల్లో చేరలేక చాలా మంది ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ డిపో ఎదుట మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశారు. హెచ్‌సీయూ డిపోలో కండక్టర్‌గా పనిచేసే సందీప్ బ్లేడ్‌తో…
హుజూర్ నగర్ లో కష్టమేనా ? ఆర్టీసీ ఎఫెక్ట్ పడుతుందా ? బైపోల్ రిపోర్ట్..!
హుజూర్ నగర్ ఉప ఎన్నిక. అధికార, ప్రతిపక్షాలు..చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా తమ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్, అధికారంలో ఉండి ఓడిపోతే అది మన వైఫల్యమేనని టీఆర్ఎస్… రెండు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల ప్రముఖులు మొత్తం హుజూర్ నగర్ లో చక్కర్లు కొడుతున్న వేళ….అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొరకరాని కొయ్యగా మారిపోయింది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన హుజూర్ నగర్ లో ఎలాగైనా తమ జెండా…
RTC Strike : వీళ్ల వల్లే ఆత్మహత్యలు… కేసీఆర్, ముగ్గురు మంత్రులపై కేసు…!
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్, ముగ్గురు మంత్రులే కారణమంటూ…. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆమె కంప్లైంట్ చేశారు. కేసీఆర్ తో పాటు..మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, దయాకర్ రావు, గంగుల కమలాకర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు ప్రజల నుంచి మద్ధతు వస్తోంది. పలు ఉద్యోగ సంఘాలు, విద్యార్థి…
RTC Strike : సురేందర్ మృతదేహానికి బీజేపీ లక్ష్మణ్ నివాళి
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిన్న(ఆదివారం) ఆత్మహత్యకు పాల్పడ్డ సురేందర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం….సురేందర్ గౌడ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించారు. మృతుడి కుటుంబసభ్యులను బీజేపీ నేత లక్ష్మణ్ పరామర్శించారు. పోరాడి మన హక్కులు సాధించుకుందామని, ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ సూచించారు లక్ష్మణ్ . శ్రీనివాసరెడ్డి, సురేందర్ గౌడ్ మృతితో మరో తెలంగాణ ఉద్యమం మొదలైందన్నారు. కార్మికుల ఉసురు కేసీఆర్‌కు తప్పకుండా తగులుతుందన్నారు…
ఉధృతంగా తెలంగాణ ఆర్టీసీ సమ్మె… ఎంటరైన విద్యార్థి సంఘాలు
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా మారింది. సమ్మెకు మద్ధతిస్తున్నట్లు ఇప్పటికే పలు విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. కమ్యూనిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు, విద్యార్థి సంఘ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను ఈడ్చి పడేశారు పోలీసులు. ముట్టడి నేపథ్యంలో బస్ భవన్ కు వందల సంఖ్యల్లో పోలీసులను పహారా పెట్టారు. ఇవాళ్టితో ఆర్టీసీ సమ్మె పదవ రోజుకు చేరింది. ప్రభుత్వం…