తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతం అవుతోంది. కార్మికుల బలిదానాల సంఖ్య రెండుకు చేరింది. హైదరాబాద్‌లో రాణిగంజ్ డిపోకి చెందిన ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుల్సుంపురాకు చెందిన సుదర్శన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, అతడిని సహచరులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుదర్శన్ తుదిశ్వాస విడిచాడు. సుదర్శన్ గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుదర్శన్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు. డబ్బులు కట్టకపోతే చెక్ బౌన్స్ అయిందని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. మరోవైపు విధులకు…
రేపు సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ….దానికోసమేనా ?
ఏపీ సీఎం జగన్ తో మెగస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. రేపు (సోమవారం) మధ్యాహ్నం ఈ సమావేశం జరుగుతుంది. సైరా సినిమా విడుదల సందర్భంగా… స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఈ నేపథ్యంలోనే జగన్ కు థాంక్స్ చెప్పడానికి, మర్యాదపూర్వకంగానే చిరంజీవి భేటీ అవుతున్నట్లు సమాచారం. అంతేకానీ… ఈ భేటీలో ఎలాంటి రాజకీయ చర్చ జరగకపోవచ్చని సమాచారం. ఈ మధ్యే చిరంజీవి నటించిన చారిత్రక సినిమా సైరా నరసింహారెడ్డి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది….
పల్నాడులో ప్రశాంతం..?!
చంద్రబాబు అండ్ టీం. ఛలో ఆత్మకూరుతో హంగామా చేసింది. పల్నాడు రక్తసిక్తం అవుతుందన్న రేంజ్ లో…అక్కడి ప్రజలను, టీడీపీ కార్యకర్తలు, నేతలను వైసీపీ నేతలు బ్రతకనివ్వడం లేదని ఆరోపణలు చేశారు. ఛలో ఆత్మకూరుకు వెళ్లకుండా పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారు. తర్వాత పల్నాడులో శాంతి భద్రతలు ప్రమాదంలో ఉన్నాయని చెబుతూ రెండు బుక్ లేట్ లు ప్రింట్ చేసి విడుదల చేశారు. అయితే సీఎం జగన్ ఆదేశాలతో ఏపీ డీజీపీ సవాంగ్ ప్రత్యక నజర్ పెట్టి పోలీసులతో నిజానిజాలు…
ఎర్రబెల్లిది…. నాలుకా ? తాటిమట్టా ?
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో….మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓ ఆట ఆడుకుంటోంది సోషల్ మీడియా. ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎర్రబెల్లి దయాకర్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎలా మాట్లాడాడు… ఇప్పుడు అధికార పక్షంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడనే దానిపై ఓ వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది. మంత్రి దయాకర్ రావుది నాలుకా ? తాటిమట్టా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు… ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ వీడియో మీకోసం ఓసారి…….
బ్రేకింగ్ : తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఉధృతం అవుతోంది. ఇప్పటికే పలు రంగాల నుంచి మద్ధతు వస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్థి జేఏసీ…ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతు ప్రకటించింది. రేపటి(సోమవారం) నుంచి నేరుగా నిరసనలకు దిగాలని నిర్ణయించింది ఓయూ విద్యార్థి జేఏసీ. ఈ నెల 14న మంత్రుల కార్యాలయాలు ముట్టడిస్తామని ప్రకటించింది. దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు. 19న విద్యా సంస్థల బంద్, 21న ప్రగతి భవన్ ముట్టడిస్తామని…
ఒకే చెట్టు నీడలో రాజకీయ పార్టీలు
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంలో రాజకీయ పార్టీల మాటల్లో ఓ విషయం పై మనం చర్చించుకోవాలి. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని…ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ పరం చేసే ఆలోచన తమకు లేదని చెబుతోంది. మరో వైపు ఆర్టీసీలో కొంత మేర ప్రైవేట్ పరం చేస్తోంది. అలాగే సంస్థను లాభాల్లోకి తీసుకురావడానికి ప్రైవేట్ చేయక తప్పదని చెబుతోంది. అయితే లాభాల్లో రావడానికి ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం…
వజ్రాల విమానం…ఎక్కడ ఉందో తెలుసా…?
ఈ విమానం దగదగ మెరిసిపోతోంది…..వజ్రాలతో దగదగలాడుతోంది. గల్ఫ్ దేశం అంటే ఎంత ధనవంతుల దేశమో తెలిసిపోతోంది. కదా. నిజంగా ఈ విమాన సర్వీస్ నడిపిస్తున్నారా…ఎక్కడ నడిపిస్తున్నారు అనుకుంటున్నారా….ఇది నిజమైన విమాన సర్వీస్ కాదు. కేవలం ఫోటో మాత్రమే. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో నిజమా అబద్దమా అని చర్చించుకుంటున్నారు. దీంతో విమానం అసులు విషయాన్ని ఎమిరేట్స్ బయట పెట్టింది. ఎమిరేట్స్ కు సంబంధించిన ఈ ఫోటో ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో…
చారిత్రక నగరంలో మహానేతలు
భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీలో మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎక్కడికి వెళ్లిన ప్రత్యేకంగా కనిపించే మోదీ, ఆ ప్రాంతంలో వ్యక్తిగా కనిపించాలనుకుంటారు. అయితే ఇప్పటి వరకు కనిపించని పంచె కట్టులో ఆయన వేషాధారణ అందరిని ఆకర్షిస్తోంది. తెల్లని పంచె కట్టు, తెల్లని చొక్కా, భుజంపై కండువా. అచ్చం తమిళ తంబిలా మెరిసిపోయారు. చూస్తుంటే నిజంగానే తమిళ తంబిలా కనిపించారు. ఇక జిన్ పింగ్ తెల్లని చొక్కాపై బ్లాక్ ప్యాంట్ తో…
హుజూర్ నగర్ ఎవరిది ? కాంగ్రెస్ కు కష్టమేనా ? టీఆర్ఎస్ ఈసారైనా గెలుస్తుందా ?
హుజూర్ నగర్ ఉప ఎన్నిక రాష్ట్రంలో హాట్ టాఫిక్. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య అసలైన పోటీ అనుకుంటున్న వేళ బీజేపీ, టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించడంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే ఇందులో సీపీఐ, సీపీఎం మద్దతు కీలకం కానుంది. టీఆర్ఎస్ సైదిరెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చింది. దీంతో ఈసారి గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక తన ఇలాక హుజూర్ నగర్ ను మరోసారి తమ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణీ…
పర్ఫెక్ట్ రివ్యూ : సైరా నరసింహారెడ్డి.. ఓ దేశభక్తుడి వీరమరణం…
కొందరు రివ్యూలు రాస్తే పైసల్ తీస్కొని రాసినట్టే ఉంటుంది. కొందరు రివ్యూ రాస్తే.. విమర్శించడానికి మాత్రమే రాసినట్టు ఉంటుంది. కానీ..కొందరు రివ్యూలు రాస్తే సినిమాలో నటించిన నటీనటులే కాదు… తెరవెనకాల పని చేసే ప్రతీ ఒక్కరి కష్టం కనపడుతుంది. అలాంటి వారిల్లో సినిమా జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్ కూడా ఒకరు. మనోడు రాసే రివ్యూ సగటు ప్రేక్షకుడికి నచ్చేలా ఉంటుంది. మా కొట్లాట వీక్షకుల కోసం ప్రవీణ్ కుమార్ రివ్యూను అతని ఫేస్ బుక్ వాల్ పై…