ఇవాళ దేశవ్యాప్తంగా మెగస్టార్ చిరంజీవి నటించిన సైరా విడుదలైంది. అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్బంగా ఈ సినిమాను విడుదల చేశారు. అయితే చిరు ఫ్యాన్స్ రాత్రి నుంచే థియేటర్లకు క్యూకట్టారు. ఆ క్యూలో కొందరు ఏపీ పోలీసులు కూడా ఉన్నారు. సైరా కోసం రాత్రంతా పడికాపులు కాశారు. కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైలు సైరా సినిమాకు వెళ్లారు. వేకువజామున కోవెలకుంట్లలో ఆరుగురు ఎస్సైలు ‘సైరా’ సినిమాకు వెళ్లారు. అయితే..ఆన్ డ్యూటీలో ఉండి సినిమాకు వెళ్లడంపై పైఅధికారులు సీరియస్…
సైరాలో ఆ సీన్ సినిమాకే హైలైట్…
సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన సైరా వచ్చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రీమీయర్ షోలు పడ్డాయి. అంతా పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతోంది సైరా. అటు యూఎస్ ప్రీమియర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఇంటర్వెల్ కు ముందు, ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు రోమాలు నిక్కపొడుకునేలా తీశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. వాటికి ప్రాణం పోశారు మెగస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే నొస్సం కోట అటాక్ సినిమాకే…
‘సైరా’ ఫస్ట్ రివ్యూ, రేటింగ్ : సినిమా ఎలా ఉందంటే…
సినిమా చూస్తున్నంత సేపు రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం.. స్వతంత్ర్య పోరాటంలో జరిగిన ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్టుగా చూపించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. కొన్ని సన్నివేశాలు గుండెళ్ను హత్తుకుంటాయి. తొలిసారి చారిత్రక పాత్రలో నటించిన మెగాస్టార్ చరిత్రలో నిలిచిపోతారు. జాతీయ అవార్డే ఆయనకోసం వేచిచూసేంత అత్యద్భుతంగా నటించారు. నిజంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇలాగే ఉండేవారేమో అని అనిపించేలా…ఆ పాత్రలో జీవించారు చిరంజీవి. భారీ బడ్జెట్ తో నిర్మించిన సైరాను… తెలుగురాష్ట్రాల కంటే ముందే చూసే అవకాశం యూఎస్…
బ్రేకింగ్ : కోర్టులో లొంగిపోయిన కోడెల శివరాం
ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం ఇవాళ (అక్టోబర్ 1) కోర్టులో లొంగిపోయారు. కోడెల పదవిలో ఉండగా కే ట్యాక్స్ పేరిట శివరాం కబ్జాలు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు కోడెల శివరాం. ఆయన అభ్యర్థనపై స్పందించిన హైకోర్టు.. శివరాంను కింది కోర్టులో లొంగిపోవాల్సింగా…
Alert : మారిన బ్యాంక్ టైమింగ్స్… ఇక నుంచి…
బ్యాంకుల టైమింగ్ మారింది. మొత్తం మూడు వేళల్ని నిర్ణయించింది ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (IBA). ఐబీఏ నిర్ణయించిన వేళలు..1. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 2. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు 3. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవాళ్టి (అక్టోబర్ 1) నుంచే కొత్త వేళలు అమలులోకి వచ్చాయి. కస్టమర్లకు సేవల్ని మరింత సమర్థవంతంగా అందించేలా బ్యాంకు వేళల్ని…
రేవంత్ కు అక్షింతలు తప్పవా ? ఆమెను పోటీలో పెట్టింది ఆయనేనా ?
నోటికాడికొచ్చిన ముద్దను తన్నడమంటే ఇదేగావొచ్చు. కాస్తా ముందో వెనకో పక్కా పీసీసీ అవుతుండే. సీనియర్లు ఎవరెన్ని సాటీలు చెప్పినా… యూత్ లో రేవంత్ కి క్రేజ్ ఉన్నదన్నది వాస్తవం. ఆ క్రేజ్ తో పార్టీని మరింత బలోపేతం చేసే ఛాన్సుంది. ఆ విషయం కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా తెలుసు. కానీ.. ఇపుడే ఎందుకులే తొందరా అని వేచిచూస్తోంది అధిష్టానం. దానికితోడు ఓటుకు నోటు కేసు కూడా ఓ అడ్డంకి. ఇవన్నీ ఇలా ఉంచితే… వచ్చే ఎన్నికల్లోపు…
పీసీసీ ఇస్తారా ? లేక నా దారి నన్ను చూసుకోమంటారా ?ఢిల్లీకి రేవంత్ !
తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ కుంపటి పార్టీ కొంపముంచేలా ఉంది. ఇప్పటికే రేవంత్ వర్సెస్ సీనియర్లుగా ఉంది పరిస్థితి. పీసీసీ పదవి విషయంలో రేవంత్ బ్యాచ్ చేసిన ఓవరాక్షన్ తో…పార్టీ సీనియర్లు ఆ పదవికి అడ్డుకట్ట వేశారు. నిన్నగాక మొన్నొచ్చిన వాళ్లకు పీసీసీలు ఇస్తే… మేమేంతా ఏం చేయాలి అంటూ బాహాటంగానే అధిష్టానం దగ్గర ఫిర్యాదులతో పాటు, అల్టీమేటం కూడా ఇచ్చారు. దీంతో పీసీసీ పదవిని హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. ఆ లోపే హుజూర్ నగర్…
కూరగాయలు అమ్ముకునే అతని కొడుకుకు టికెట్ ఇచ్చిన బీజేపీ
కూరగాయాలు అమ్ముకుని సాదాసీదా వ్యక్తికి కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీజేపీ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోసి అసెంబ్లీ స్ధానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా..కూరగాయలు అమ్ముకుని జీవించే నంద్‌లాల్ రాజ్‌భర్ కుమారుడు విజయ్ రాజ్‌భర్‌ను ఎంపిక చేసింది. BJP నాకు చాలా అత్యున్నత బాధ్యత కట్టబెట్టిందని, తండ్రి ఫుట్ పాత్ పై కూరగాయలు అమ్ముతాడు, నన్ను గెలిపిస్తే ప్రతీ పేదవాడికి అందుబాటులో ఉంటానన్నాడు విజయ్. విజయ్ బీజేపీలో చురుకుగా పనిచేయడంతో పాటు నగర పార్టీ అధ్యక్షడిగా వ్యహరిస్తున్నారు….
టీడీపీకి షాక్… జెండా దించేసిన మరో యువనేత…
టీడీపీ పరిస్థితి అస్సలు బాలేదు. అటు ఏపీలో అధికారం కోల్పోయి చావుదెబ్బ తిన్న టీడీపీ ఇప్పట్లో కోలుకునేలా లేదు. ఇక తెలంగాణ టీడీపీ పరిస్థితి అయితే మరీ దారుణం. అసలా పార్టీలో ప్రముఖులు అనేవాళ్లే లేకుండాపోయారు. ఉన్న ఒక్కరిద్దరు కూడా… టైమ్ చూసుకుని కుదిరితే కారు.. లేదంటే కాషాయం కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. తెలంగాణ టీడీపీలో ఓ వెలుగు వెలిగిన దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు…
ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ : సీఎం జగన్ ప్రకటన
ఆంధ్రా సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగులకు మరో తీపికబురందించారు. లక్షన్నర దాకా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో సంచలనం సృష్టించిన జగన్ ప్రభుత్వం… జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటించింది. ప్రతీ ఏటా జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేస్తామని… ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం జగన్. జనవరి 1 నుంచి జనవరి 30 దాకా ప్రతీ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే వీలు కల్పిస్తామని తెలిపారు. ఒక్క…