Ustaad Bhagat Singh : అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్.. మార్చి 26న బాక్సాఫీస్ వద్ద ‘ఉస్తాద్’ జాతర!

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను (Ustaad Bhagat Singh)మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

నిజానికి మార్చి 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా పెద్ది విడుదల కావాల్సి ఉంది. అయితే, షూటింగ్ పనులు ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవుతుండటంతో పెద్ది సినిమాను మే నెలకు వాయిదా వేస్తున్నట్లు సమాచారం. అబ్బాయ్ సినిమా రేసు నుంచి తప్పుకోవడంతో, అదే క్రేజీ సమ్మర్ స్లాట్‌ను బాబాయ్ పవన్ కల్యాణ్ తన ఉస్తాద్ సినిమాతో ఆక్యుపై చేసేశారు.

గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ – హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో పవన్ మళ్ళీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన దేఖ్‌లేంగే సాలా సాంగ్,గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.

మార్చి 26న విడుదల చేయడం ద్వారా సమ్మర్ హాలిడేస్‌ను పూర్తిగా వాడుకోవాలని మేకర్స్ ప్లాన్ చేశారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మాస్ సాంగ్స్ ఇచ్చారని టాక్. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్ ఇవ్వబోతున్నారు.