లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం ఏమనుకుంటుందంటే…..

లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం ఏమనుకుంటుందంటే…..

లాక్ డౌన్ పొడిగించే అంశంపై….అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ. మెజారిటీ ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించేందుకే మొగ్గుచూశారు. ఏప్రిల్ 14తో ముగియనున్న లాక్ డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని కోరారు. అయితే కొందరు ముఖ్యమంత్రులు మాత్రం లాక్‌డౌన్‌ను కేవలం కరోనా వ్యాప్తి చెందిన రెడ్ జోన్లకు మాత్రమే పరిమితం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. అయితే మెజార్టీ రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగింపును సమర్థించడంతో… దీనిపై ప్రధాని మోదీ అధికారికంగా ఓ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారని సమాచారం.

ఇదే సమయంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ విషయంలో వెనక్కి తగ్గే ఆలోచనలో లేరని కర్ణాటక సీఎం యడియూరప్స వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే 15 రోజులకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలకు ఉంటాయనే విషయాన్ని ప్రధాని మోదీ ఒకటి రెండు రోజుల్లో చెబుతారని… వీడియో కాన్ఫిరెన్స్ అనంతరం యడియూరప్ప స్పష్టం చేశారు.