పెట్రోలు-కిరోసిన్ మిక్స్ చేసి సజీవదహనం : విజయారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు

ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో ఆవరణలో 30 వరకు శాంపిల్స్ ని క్లూస్ టీం సేకరించింది. సేకరించి శాంపిల్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు అధికారులు. ఎమ్మార్వో ఆఫీస్ పక్కనున్న బాయ్స్ హాస్టల్, చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వీడియోలను పోలీసులు సేకరించారు. విజయారెడ్డికి నిప్పంటించి నిందితుడు సురేష్ తాపీగా రోడ్డుపై నడుచుకుంటూ స్టేషన్ వైపు వెళ్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు. సోమవారం(నవంబర్ 4న) మధ్యాహ్నం 2.25 ని.లకు ఈ ఘటన జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డైంది. రెండు లీటర్ల బాటిల్లో కిరోసిన్, పెట్రోల్ మిక్స్ చేసి తీసుకొచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. సురేష్ తండ్రి కూర కిష్టయ్య, కూర భిక్షపతి, కూర ఆనంద్‌ తో పాటు నిందితుడి స్నేహితులు, సన్నిహితులను అబ్దుల్లాపూర్ మెట్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కూర సురేష్… రోజుల తరబడి ఎమ్మార్వో తనను సతాయించినందుకే కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు వాంగ్మూలమిచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం విజయారెడ్డి అంత్యక్రియలు నాగోల్ స్మశాన వాటికలో ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాల మధ్య ఎమ్మార్వోకు కన్నీటి వీడ్కోలు పలికారు.

రోడ్డుపై తాపీగా నడుచుకుంటూ వెళ్తున్న కూర సురేష్